మెగా స్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీసు పై తన పట్టును తిరిగి చాటుకోవడమే కాకుండా ఏకంగా ఉత్తరాంద్రలో ‘బాహుబలి’ రికార్డులను ‘ఖైదీ’ బ్రేక్ చేసిన నేపధ్యంలో మెగా కాంపౌండ్ సంబరాలలో మునిగి తేలుతోంది.  అయితే చిరంజీవి మాత్రం ఒక అయోమయ స్థితిలో తన కన్ఫ్యూజన్ మైండ్ ను కొనసాగిస్తూ తన సన్నిహితులతో ఎడతెగని చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పదేళ్ళ తరువాత తెలుగు ప్రజలు తనపై కురిపిస్తున్న అభిమానానికి పొంగిపోవలసిన చిరంజీవి ఇలా కన్ఫ్యూజ్ కావడానికి చిరంజీవి తదుపరి నటించవలసిన 151వ సినిమా కథ అని అంటున్నారు. ‘ఖైదీ’ ఇచ్చిన క్రేజ్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ సమ్మర్ లోపే తన 151వ సినిమాని మొదలుపెట్టి ఇదే సంవత్సరం తన 151వ సినిమాని విడుదల చేయాలని చిరంజీవి గట్టి పట్టుదలమీద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే చిరంజీవి మనసు మాత్రం ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ సబ్జెక్ట్ పై ఊగిసలాడుతూ ఉంటే మెగా కుటుంబ సభ్యులు మాత్రం చిరంజీవిని మరొక మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయవలసిందిగా వొత్తిడి చేస్తున్నట్లు టాక్.  దీనికితోడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ కథకు సంబంధించిన సినిమాకు భారీ గ్రాఫిక్స్ కావలసి ఉన్న నేపధ్యంలో ఈసినిమాను చిరంజీవి వెంటనే ఎత్తుకుంటే ఈ సినిమా ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి ఇదే సంవత్సరం విడుదల చేయడం కష్టం అన్న అభిప్రాయాన్ని మెగా కుటుంబ సన్నిహితులు చిరంజీవి వద్ద వ్యక్తపరుస్తున్నట్లు టాక్.

దీనికితోడు చిరంజీవి 151వ సినిమాను దర్శకత్వం వహించవలసిన సురేంద్ర రెడ్డి చారిత్రాత్మక సినిమాను గతంలో తీసిన నేపధ్యం లేకపోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ కు సురేంద్ర రెడ్డి న్యాయం చేయలేదు అన్న అభిప్రాయాన్ని కూడ చిరంజీవి వద్ద మెగా స్టార్ సన్నిహితులు వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనితో ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి ఏదైనా ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను కాని లేదంటే మరో రీమేక్ ను కాని తన 151వ సినిమాగా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అన్న సుధీర్గ చర్చలలో చిరంజీవి మునిగితేలుతున్నట్లు టాక్. 

దీనిని బట్టి చూస్తుంటే చిరంజీవికి ‘ఖైదీ’ ఇచ్చిన సక్సస్ ఆనందం కంటే కన్ఫ్యూజన్ మరింత పెంచింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: