ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగార్జున తన సినిమాల గురించి వ్యక్తగత జీవితం గురించి తన పిల్లల గురించి అనేక ఆ సక్తికర విషయాలను షేర్ చేసాడు.  ఒకే సంవత్సరం ఇద్దరు కోడళ్ళను తన ఇంటికి తెచ్చుకుంటున్న ‘యంగ్ మామ’ గా తనను టాలీవుడ్ ఇండస్ట్రీలో పిలుస్తున్నారు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు నాగార్జున. 

తనకు దేవుడు అన్నీ ఇవ్వడం వల్ల తనకు సమస్యలే లేవని అని చాలామంది అనుకుంటూ ఉంటారని అంటూ తనకు దేవుడు రోజుకు ఒక పరీక్ష పెడతాడని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  ముఖ్యంగా అఖిల్ సినిమా సక్సస్ కాలేదు అన్న బాధ తనకు దేవుడు పెట్టిన పెద్ద పరీక్ష అని అంటూ అఖిల్ సినిమా విడుదలై సంవత్సరంన్నర దాటిపోయినా ఇంకా అఖిల్ రెండవ సినిమా స్టార్ట్ కాకపోవడం తనకు దేవుడు పెట్టిన పెద్ద పరీక్ష అంటూ మరో జోక్ వేసాడు నాగార్జున. 

ఇక తనకు కాబోయే కోడళ్ళు శ్రియా భూపాల్ – సమంతల గురించి మాట్లాడుతూ తన చిన్నకోడలు శ్రియ భూపాల్ తనకు చిన్నప్పటి నుంచి తెలియడంతో తనను ఎప్పుడూ ‘నాగ్ మామ’ అంటూ అభిమానంగా పిలుస్తుందని అయితే సమస్య మాత్రం సమంత దగ్గరే వచ్చింది అంటూ జోక్ చేసాడు నాగార్జున. తన పెద్ద కోడలు సమంత ఇప్పటి వరకు తనను ఎక్కడ కలిసినా ‘నాగ్ సార్’ అంటూ పిలవడం అలవాటు చేసుకుందని అయితే భవిష్యత్ లో తనను అలా పిలిస్తే సమంతను చంపేస్తా అని బెదరించానని నాగ్ చెపుతూ సమంత మాత్రం ఇంకా తనను పిలిచే విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే కొనసాగుతోంది అంటూ జోక్ చేసాడు.

తాను నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ తన లేటెస్ట్ మూవీ ‘హాధీరామ్ బాబా’ తనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి అంటూ ఇంకా తాను చాల సంవత్సరాలు టాలీవుడ్ లో హీరోగానే కొనసాగుతాను అంటూ జోక్ చేసాడు నాగార్జున. ఇక తన సినిమాలకు సంబంధించి దగ్గర పడుతున్న తన 100వ సినిమా గురించి మాట్లాడుతూ ఆ నెంబర్ గురించి తాను పెద్దగా పట్టించుకోవడం లేదని పట్టించుకుంటే కలక్షన్స్ రికార్డులు కంపేరిజన్ వస్తుంది అంటూ జోక్ చేసాడు నాగార్జున.. 


మరింత సమాచారం తెలుసుకోండి: