సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు జపాన్ లో కూడ బాగా చూస్తారు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే రజినీకాంత్ క్రేజ్ లో కనీసం 1 పర్సెంట్ కూడ లేని సంపూర్ణేష్ బాబు సినిమాను ఆఫ్రికన్ భాషలోకి డబ్ చేయబోతూ ఉండటం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది.  ఇప్పటి వరకు మన టాప్ హీరోల సినిమాలకు అమెరికాలో డాలర్స్ కురుస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఏకంగా ఈ బర్నింగ్ స్టార్ ను ఆఫ్రికన్ ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

ఈమధ్య కాలంలో సంపూ హడావిడి తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇతడి ‘కొబ్బరి మట్ట’ సినిమాకు సంబంధించి గత ఏడాది ఒక లెంగ్తీ డైలాగ్ తో వెరైటీ టీజర్ ను విడుదల చేసారు.  ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆ తరువాత ఈసినిమాకు సంబంధించిన ఎటువంటి వార్తలు బయటకు రాకపోవడంతో ఈసినిమా ఆగిపోయే ఉంటుందని కొన్ని గాసిప్పులు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన వార్తలు మళ్ళీ హడావిడి చేస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీని ఆఫ్రికా భాషలోకి అనువాదం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని నైజీరియాలో  రిలీజ్ చేస్తారట. అంతేకాదు ఈ మూవీని తమిళ కన్నడ భాషలలో కూడ డబ్ చేసి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో సంపూర్ణేష్ కు అంత మార్కెట్ ఉందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అయితే గతంలో ‘హృదయ కాలేయం’ అంటూ ఊహించని మెరుపులా మెరుపులు మెరిపించిన సంపూ నటన అతడి విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ ఆఫ్రికన్ ప్రజలకు బాగా నచ్చితే సంపూ అంతర్జాతీయ నటుడుగా మారినా ఆశ్చర్యం లేదు..    


మరింత సమాచారం తెలుసుకోండి: