ఒక ఆలోచన ఒక ప్రయోగం మరో ఆవిష్కరణకు దారులు తీస్తుంది. ఇప్పుడు - బాహుబలి 2, ది కంక్లూజన్ - కోసం లో 4కె రిజల్యూషన్ ప్రొజెక్టర్స్ తో థియేటర్స్ సిద్దమౌతు న్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


Related image

తెలుగు చలన చిత్ర అమర శిల్పి జక్కన్న రాజమౌళి ఈ సినిమాను ఏప్రిల్ 28 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బాహుబలి లో కంటే బాహుబలి-2 సినిమాలో సాంకెతికతకు అంటే గ్రాఫిక్స్‌కు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాహుబలి-2 ను విజువల్‌, గ్రాఫిక్స్‌ పరంగా ఎంత గొప్పగా ఘనంగా తెరకెక్కించి నా, థియేటర్ల లో ఆ సాంకేతికత వినియోగించి ప్రదర్శించగల ప్రొజెక్టర్స్‌, ప్రొజెచ్తిఒన్ సిస్టం కూడా ఉండాలి అపుడే సినిమా నిర్మించినత ఘనంగా చూపించగలం.


Image result for 4k resolution

అప్పుడే విజువల్స్ అనుభూతిని ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతాడు. ఇందు కోసం ఈ సినిమా విడుదలయ్యే థియేటర్లలో కొన్నింటి లో 4కె రిజల్యూషన్‌తో కూడిన ప్రొజెక్టర్స్‌ తో సినిమా ను వెండితెరపై ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 200 థియేటర్లు బాహుబలి-2 కోసం "అడ్వాన్స్డ్ టెక్నాలజీ" తో కొత్త సొబగులు, సొగసులు సంతరించుకోనున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రొజెక్టర్స్ 4కె టెక్నాలజీ ప్రొజెక్టర్స్‌గా మారాలంటే ఆషామాషీ విషయం కాదు. దాదాపు ఒక్కో థియేటర్‌కు కోటి రూపాయల ఖర్చవుతుంది.


Related image

అయితే ఈ సినిమాపై ఉన్న నమ్మకం తో ఈ ఖర్చుకు కూడా థియేటర్ యాజమాన్యాలు వెనుకాడటం లేదట. అయితే ఇవి కేవలం ఏషియన్ సినిమాస్, ఐమాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రమే. కొందరు మాత్రం 4కె ప్రొజెక్టర్స్ అద్దెకు తెచ్చుకుని ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. థియేటర్ యాజమాన్యాలు బాహుబలి-2 పై ఇంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు.

Image result for 4k resolution

బాహుబలి సినిమాను కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో 4కె స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ ఒక్క థియేటర్‌లో ఈ టెక్నాలజీ సాయంతో సినిమా ప్రదర్శించడం వల్ల 3.50 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. ఇదీ అసలు విషయం.


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: