గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాకుండా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. దీనితో బాలు చేసిన ఈ కామెంట్స్ ఈ మధ్య విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న మెగా స్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ ని దృష్టిలో పెట్టుకుని బాలు ఈ కామెంట్స్ చేసి ఉంటాడు అన్న మాటలు  వినిపిస్తున్నాయి. 

ఇక వివరాలలోకి వెళ్ళితే  రోటరీ క్లబ్ నుంచి జీవితకాల సాఫల్యపురస్కారం అందుకున్న సందర్భంగా బాలు ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  మన తెలుగు సినిమాల స్థితి ముఖ్యంగా మన సినిమా హీరోల  అభిమానుల తీరును ఎండగట్టుతూ బాలు అనేక కామెంట్స్ చేసాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు పేరు రాకపోవడానికి మనవాళ్లలో అంకితభావం లేకపోవడమే కారణo అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసాడు. 

ఈకార్యక్రమంలో అత్యంత ఆవేశంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘లబ్దప్రతిష్టులయిన హీరోలు తెలుగుజాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తేయలేరా? ఎంత సేపూ కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ, ఎంతమంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తున్నారా ? అని ప్రశ్నించగలుగుతున్నారా ? ‘దంగల్’ సినిమాను ఆమిర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం?’ అని ప్రతిఒక్క ప్రేక్షకుడు  అభిమాని ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ అభిమానుల వంక పెట్టుకుని హీరోలను టార్గెట్ చేసాడు బాలు.

ఇదే సందర్భంలో బాలు మాట్లాడుతూ సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లా మారిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏటాప్ హీరో  అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న టాప్ హీరోల అభిమానులను టార్గెట్ చేసాడు బాలు.

ఇదే సందర్భంలో తన మాటలకు మరో ట్విస్ట్ ఇచ్చాడు బాలు. హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోలచేసే అభిమానులు ఆస్థాయిలో సినిమాలు చేయడం లేదని తమ హీరోలను ఎందుకు ప్రశ్నించరు ? అంటూ మరో మాటల బాణం వదిలారు. అగ్ర కథానాయకులు సినిమా కలక్షన్స్ రికార్డులు పై కాకుండా కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి అంటూ పిలుపు ఇచ్చాడు బాలసుబ్రహ్మణ్యం.  అయితే ఈ టాప్ సింగర్ ఇప్పుడు ఇంత హడావిడిగా టాప్ హీరోల సినిమా రికార్డులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: