సంగీతంతో దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించవచ్చు అన్న పరిశోధనలు చాల చోట్ల జరుగుతున్నాయి.  అయితే పవన్ ఈసారి సంగీతాన్ని ఆయుధంగా మార్చి ‘దేశ్ బచావో’ అన్న స్లోగన్ తో ఒక మ్యూజికల్ ప్రొటెస్ట్ ఆల్బమ్ ను రేపు తన ‘జనసేన’ తరఫున విడుదల చేస్తున్నట్లు పవన్ తన ట్విటర్ లో ప్రకటించాడు. 

అవకాస వాదం - క్రిమినల్ పాలిటిక్స్ పై నిరశన గళాన్ని విప్పుతూ యువతరాన్ని చైతన్య పరిచే పాటలు ఈ ‘దేశ్ బచావో’ మ్యూజికల్ ఆల్బమ్ లో ఉంటాయని పవన్ తన ట్విటర్ లో తెలియచేసాడు. అంతేకాదు ఈ నెల 26న విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తూ జరగబోతున్న మౌన ర్యాలీకి కూడ తన సపోర్ట్ ఉంటుంది అని తన బహిరంగ మద్దతును పవన్ ఈ కార్యక్రమానికి తెలియచేసాడు. 

తమిళనాడులో జల్లికట్టు కోసం తమిళ యువత అంతా ఏకత్రాటి పైకి వచ్చి తమ జల్లికట్టు కోరికను నెరవేర్చుకున్న నేపధ్యంలో పవన్ ఆ ఉద్యమ స్పూర్తితో మన ఆంధ్రప్రదేశ్ లోని యువతరాన్ని చైతన్యవంతం చేసి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్న ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగానే పవన్ ఈ మ్యూజికల్ ఆల్బమ్ ను ‘దేశ్ బచావో’ పేరుతో విడుదల చేస్తున్నాడను కోవాలి. 

కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉండే పవన్ తన ‘జనసేన’ పార్టీ కార్యక్రమాలను రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోరాడాలని అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం పాటలతో నినాదాలతో జనం మారిపోయి రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ కు ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తారు అని అనుకోవడం కొంత వరకు పవన్ కంటున్న పగటి కలలు మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: