‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఘన విజయంతో టాప్ డైరెక్టర్స్ జాబితాలోకి దూసుకు వెళ్ళిపోయాడు క్రిష్. ఇప్పుడు టాప్ హీరోలు అంతా క్రిష్ వైపు చూస్తున్నారు అంటే క్రిష్ రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది.  ఇప్పటికే వెంకటేష్ 75వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన క్రిష్ కు మరో మెగా ఆఫర్ వచ్చినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

సినిమా రంగంలో ఒక హీరోతో అనుకున్న కథ వేరే హీరోతో సినిమాగా రావడం సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు అటువంటి సందర్భమే క్రిష్ విషయంలో కూడా జరుగుతోంది. క్రిష్ గతంలో వరుణ్ తేజ్ తో చేయాలి అనుకున్న ‘రాయబారి’ మూవీ ప్రాజెక్ట్ ఇప్పుడు రామ్ చరణ్ తో పట్టాలు ఎక్కేందుకు సిద్ధం అవుతోంది అని టాక్.  

క్రిష్ ‘శాతకర్ణి’ సినిమాను మొదలు పెట్టక ముందు హాలీవుడ్ సినిమాల మాదిరిగా ఒక స్పై ధ్రిల్లర్ మూవీని వరుణ్ తేజ్ తో తీయాలని ఆసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ పెట్టడమే కాకుండా ఆసినిమాకు ‘రాయబారి’ అనే టైటిల్ కూడ ఫిక్స్ చేసాడు క్రిష్. స్పైయింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్షన్ మూవీగా ఈసినిమాను తీయాలని క్రిష్ ఎంతగానో ప్రయత్నించినా బడ్జెట్ సమస్యలతో ఈమూవీ ముందుకు వెళ్ళలేదు. 

అయితే ‘శాతకర్ణి’ విడుదల తరువాత మెగా కాంపౌండ్ పిలుపు మేరకు రామ్ చరణ్ ను కలిసిన క్రిష్ మాటల సందర్భంలో ఈ ‘రాయబారి’ ప్రాజెక్ట్ గురించి చరణ్ కు చెప్పినట్లు టాక్.  ఈ మూవీ ప్రాజెక్ట్ డిటైల్స్ విపరీతంగా చరణ్ కు నచ్చడంతో ఈసినిమాలో తాను నటిస్తానని అదేవిధంగా అవసరం అయితే తానే నిర్మిస్తానని మాట ఇచ్చాడట. అంతేకాదు ఈసినిమా బడ్జెట్ గురించి అసలు ఆలోచనలు చేయవద్దని చరణ్ క్రిష్ కు సలహా ఇచ్చినట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత పట్టాలు ఎక్కుతుందని తెలుస్తోంది.  ఈలోపున క్రిష్ వెంకటేష్ తో తాను తీయబోయే 75వ సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఏవిధంగా చూసుకున్న క్రిష్ హవా పరుగులు తీయడమే కాకుండా ఏకంగా చరణ్ ను క్రిష్ బుట్టలో పెట్టాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: