సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఏప్రియల్ 28న విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ పై పడింది. చిరంజీవి ‘ఖైదీ’ కొన్ని ఏరియాలలో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసిన నేపధ్యంలో ‘ఖైదీ’ కలక్షన్స్ తో రాజమౌళికి కొత్త టార్గెట్ లు ఏర్పడుతున్నాయి. 

మారుతున్న పరిస్తుతులను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి కూడ తన ‘బాహుబలి 2’ ద్వారా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ఈసినిమాకు సంబందించి మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు 4కె రిజల్యూషన్‌తో కూడిన ప్రొజెక్టర్స్‌ తో కూడిన ధియేటర్స్ లోనే ‘బాహుబలి 2’ సినిమాను ప్రదర్శించాలని రాజమౌళి టీమ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దేశవ్యాప్తంగా దాదాపు 2వందల థియేటర్లలో ‘బాహుబలి2’ ను ఇటువంటి  అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ధియేటర్స్ లో విడుదల చేయాలని రాజమౌళి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడున్న ధియేటర్స్ లోని ప్రొజెక్టర్స్ అన్నీ 4కె టెక్నాలజీ ప్రొజెక్టర్స్‌గా మారాలంటే సామాన్యమైన విషయం కాదు అని అంటున్నారు. దాదాపు ఒక్కో థియేటర్‌కు కోటి రూపాయల ఖర్చవుతుంది అన్న మాటలు వినపడుతున్నాయి. అయితే విజువల్‌పరంగా ఎంత ఘనంగా తీసిన ‘బాహుబలి 2’ ను చాల అందంగా చూపించాలి అంటే ఇలాంటి టెక్నాలజీతో కూడిన ప్రొజెక్టర్స్ అవసరమని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. 

దీనితో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీలోకి మార్పులు చేసుకోవలసిందిగా ‘బాహుబలి 2’ టీమ్ నుండి దియేటర్లకు సంకేతాలు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి టెక్నాలజీని ఏర్పరుచుకునే సామర్ధ్యం  ఏషియన్ ఐమాక్స్ సినీమాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రమే ఉండటంతో సాధారణ ధియేటర్లు ఎంతవరకు రాజమౌళి సూచనలు ఆచరిస్తారు అన్న సంశయం చాలామందిలో ఉంది. ఇప్పటికే 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ గా అడుగులు వేస్తున్న రాజమౌళి తన ‘బాహుబలి 2’ కోసం ఇంకా ఇటువంటి కొత్త కండిషన్స్ ఎన్ని పెడతాడో అన్న భయంలో దియేటర్ల యాజమాన్యాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: