ఈ మధ్య కాలంలో మెగాస్టార్ ని తెగ తిట్టిన వర్మ...ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. చిరు నటించిన ఖైదీనెం.150వ చిత్రం రిలీజ్ సమయంలో వర్మ ఓ రేంజ్‌ లో ఈ మూవీపై నిప్పులు చెరిగారు. తన ట్వీట్లతో మెగాస్టార్ మూవీకి పూర్తి నెగిటివ్‌ టాక్స్ ని తీసుకురాగలిగారు. కానీ ఈ మూవీని ఫ్యాన్స్ ఓ రేంజ్‌ లో హిట్ చేశారు.

అంతే కాకుండా సామన్య సినీ ప్రేక్షకులు సైతం ఖైదీ నెం.150 చిత్రాన్ని ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చిరు వర్సెస్ వర్మ అన్నట్టుగా పోటీ వాతావరణం ఏర్పడింది. చిరు సైతం తనదైన శైలిలో వర్మపై సెటైర్స్ ని విసిరారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం...చిరు నటించబోతున్న 152వ చిత్రానికి వర్మ దర్శకత్వం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న సర్కార్‌ 3 చిత్రం పూర్తయిన వెంటనే చిరు కోసం ప్రత్యేకంగా సర్కార్ తరహా కథని తెలుగులో తెరకెక్కించనున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకోసం వర్మ ఇప్పటికే చిరుతో మాట్లాడినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. అయితే వర్మ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి...వర్మ తో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనేదానిపై మెగాస్టార్ కాస్త కన్ఫ్యూజన్‌ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి 9 ఎళ్ళ తర్వాత సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆయన అభిమానులు, ప్రేక్షకులు, సినీ జనాలకి ప్రత్యేకమైన సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి.. తనదైన శైలిలో చిరు కొత్త రికార్డును సృష్టించారు. మొత్తంగా వర్మ తో చిరు ముందుకు వెళతారో? లేదో? తెలియాలంటే మరికొంత కాలం వెయిట్‌ చెయ్యాల్సిందే అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: