టాలీవుడ్ సినిమా రంగంలో అనేక సంచలనాలు చేసి 150 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ప్రస్తుతం మారిన పరిస్థుతులకు అనుగుణంగా సినిమాలు తీయలేకపోతూ ఉండటంతో ఒక విధమైన అబధ్రతా భావంతో అవకాసం చిక్కినప్పుడల్లా ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం పరిపాటి అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా దాసరి నిన్న జరిగిన ఒక ఫంక్షన్ లో స్టార్ డైరెక్టర్స్ పై విరుచుకు పడ్డారు. 

దాసరి నిర్మాతగా మారి నిర్మించిన 'అభిషేకం' సీరియల్‌ జనవరి 22 నాటికి 2500 ఎపిసోడ్స్‌ పూర్తి అయిన సందర్భంలో నిన్న జరిగిన ఈ ‘అభిషేకం’ సీరియల్ నటీనటుల యూనిట్ అభినందన సభలో దాసరి మాట్లాడుతూ ''టీవీ సీరియళ్లు నిర్మించడం, దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు. ఇప్పటి స్టార్‌ దర్శకులెవరైనా ఓ సీరియల్‌కి దర్శకత్వం వహించి వంద ఎపిసోడ్లు పూర్తి చేయమనండి. వాళ్లకు పాదాభివందనం చేస్తా'' అంటూ స్టార్ డైరెక్టర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు దాసరి. 

టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత ఆధ్వర్యంలో ‘అభిషేకం’ నటీనటులను, సాంకేతిక నిపుణులను నిన్న ఆదివారం హైదరాబాద్‌లో సత్కరించిన కార్యక్రమంలో దాసరి తన మాటల వేడిని మరింత పెంచారు. తెలుగువాడు అరుదైన ఘనత సాధిస్తే పట్టించుకోం అని అంటూ ‘మీ అభిమాన దర్శకుడు ఎవరు' అని ఏ తెలుగువాణ్నైనా అడగండి. మణిరత్నం పేరో బాలచందర్‌ పేరో చెబుతారు కానీ కెవి రెడ్డి లాంటి గొప్ప దర్శకుల పేర్లు కూడ మరిచిపోతున్నారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు దాసరి. 

అదేవిధంగా ఎవరైనా ఒక సినిమా సెలిబ్రేటీని ‘మీ అభిమాన చిత్రం ఏది' అంటే వూరు పేరు తెలియని దర్శకుడు తీసిన ఇంగ్లిషు సినిమా పేరు చెబుతారు’ అంటూ దాసరి జోక్ చేయగానే ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు తెగ నవ్వుకున్నారు.  ఇదే సందర్భంలో దాసరి ఆదేదనతో మాట్లాడుతూ తమిళ కన్నడ మళయాళ సినిమా రంగాల సినిమాల ముందు మనకు మనమే మన సినిమాలను కళలను  మరుగుజ్జులుగా చేసుకుంటున్నాం అంటూ మరో ఘాటైన వ్యాఖ్యలకు తెర తీసాడు దాసరి.

ప్రస్తుతం బుల్లితెర పై సినిమా రంగానికి మించిన పోటీ ఉందని ఈ పరిస్థుతులలో ‘అభిషేకం’ సీరియల్ 2500 ఎపిసోడ్స్ నడిపించడం ఒక మైలురాయి అని అంటూ ఈసీరియాల్ ను 5000 ఎపిసోడ్స్ వరకు పొడిగించి ప్రపంచ రికార్డ్ సాధిస్తాను అని ప్రకటించాడు దాసరి. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు తనకు బుల్లితెర పై నటించాలి అన్న కోరిక ఉంది అని ప్రకటించిన నేపధ్యంలో త్వరలోనే ఈ గురు శిష్యులు ఇద్దరూ ఒక భారీ సీరియల్ తో బుల్లితెరను షేక్ చేస్తారు అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: