‘ఖైదీ నంబర్ 150’ రికార్డులు మెగా అభిమానులను జోష్ లోకి తీసుకు వెళ్ళిపోతూ ఉంటే 10 సంవత్సరాల తరువాత కూడ చెక్కు చెదరని చిరంజీవి క్రేజ్ ను చూసి కేవలం టాలీవుడ్ వర్గాలు మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుతం చిరంజీవికి ఏర్పడిన క్రేజ్ ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలలో క్రియా శీలకంగా లేని నేపధ్యంలో చిరంజీవిని ఎదో విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షింప చేసేలా ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు టాక్.  చిరంజీవిని పెట్టుకుని మరొక రెండేళ్ళల్లో రాబోతున్న ఎన్నికలను ఎదుర్కుంటే బిజెపి కి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న ఆలోచనలు కూడ బిజెపి లోని ఒక వర్గం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా వ్యవహరించడం వల్ల ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారుతున్న పవన్ కు చెక్ పెట్టాలని బిజెపి లోని ఒక వర్గం ఇప్పటికే ఆలోచనలు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ‘ఖైదీ’ సూపర్ సక్సస్ తరువాత చిరంజీవిని తిరిగి టచ్ లోకి తీసుకుంటున్న రాజకీయవేత్తల సంఖ్య కూడ బాగా పెరిగి పోతోంది అన్న టాక్ కూడ చాల గట్టిగా వినిపిస్తోంది. 

ఇది ఇలా ఉండగా చిరంజీవి తన సినిమాల జోరును మరింత పెంచే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఈ సంవత్సరం మార్చి నుండి చిరంజీవి తన తదుపరి సినిమాను సురేంద్ర రెడ్డితో చేయడానికి లైన్ క్లియర్ చేసి ఇదే ఏడాది చివరి నుండి బోయపాటి శీను డైరక్షన్ లో మరో సినిమాను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

'ఖైదీ నెంబర్‌ 150' సినిమా కోసం చిరంజీవి వెయిట్‌ బాగా తగ్గినా వెండి తెర మీద ఇంకా మెగా స్టార్ కొంచెం బొద్దుగానే కన్పించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో చిరంజీవి ఇక భవిష్యత్ లో చేయబోయే సినిమాలలో మరింత స్లిమ్ గా కనిపించడం కోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైట్‌ కంట్రోల్‌తోపాటు, ట్రెయినర్‌ని ప్రత్యేకంగా నియమించుకుని మరీ సన్నబడే ప్రయత్నాల్లో ఉన్నాడట చిరంజీవి. ఈప్రయత్నాలు ఈవిషయాలు అన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి మెగా కమిట్ మెంట్ కు అందరు షాక్ అవుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: