తమిళనాడు జల్లికట్టు ఉద్యమం మన తెలుగు యువ హీరోలకు చాలా పెద్ద స్ఫూర్తినే ఇస్తోంది. తమిళనాడులో ఆ ఉద్యమానికి కోలీవుడ్ సినీ పరిశ్రమ యావత్తూ సంఘీభావం ప్రకటించడంతో అదే స్ఫూర్తిని మన ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మన హీరోలకు ఎందుకు లేదు అంటూ చాల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.  

‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా అతనికి టాలీవుడ్ సినిమా రంగం నుండి ఇప్పటి వరకు సరైన సపోర్ట్ రాలేదు అన్నది వాస్తవం.  అయితే ఇప్పుడు పవన్ ఉద్యమ స్పూర్తికి టాలీవుడ్ యంగ్ హీరోలు కొందరు బాసటగా నిలుస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ లో ఈ నెల 26న జరిగే మౌన నిరసన ప్రదర్శనకు తాము మద్దతునిస్తున్నామని యువ హీరోలు సందీప్ కిషన్, నిఖిల్, సంపూ ప్రకటించారు. 

అంతేకాదు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ ర్యాలీలో పాల్గొంటానని సందీప్ ట్వీట్ చేశాడు. నిఖిల్ కూడా పూర్తి సంఘీభావం తెలుపుతున్న నేపధ్యంలో  సంపూ బాబు సైతం ఇలాగే ట్వీట్ చేసి విశాఖపట్నం యూత్ కు జోష్ ను ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ మళ్ళీ తన మౌన ముద్రను వీడి వరుసట్వీట్లతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ తన ‘జనసేన’ వాణిని వినిపిస్తున్నాడు. 

‘గాంధీజీని ప్రేమిస్తాం..అంబేద్కర్ ని ఆరాధిస్తాం. సర్దార్ పటేల్ కి సెల్యుట్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాని తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే చూస్తూ కూర్చోం మెడలు వంచి, కింద కూర్చోపెడతాం. తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, తిరగబడతాం’ అన్నది ఆంధ్రయువత కేంద్రంకి తెలియజెప్పాలిఅంటూ పవన్ తన గొంతును మరింత పెంచుతున్నాడు. 

రేపటి నుంచి ప్రత్యేక హోదాపై 'దేశ్ బచావో' పేరిట ఓ మ్యూజికల్ ఆల్బంతో పవన్ ముందుకు వస్తున్న నేపధ్యంలో రిపబ్లిక్ డేనాడు ఆర్కే బీచ్ అంతా టాలీవుడ్ యంగ్ హీరోల హవాతో నిండిపోతోంది అనుకోవాలి.  వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎప్పుడో నీరుకార్చి వేసినా టాప్ యంగ్ హీరోలు మాత్రం పవన్ అడుగులను అనుసరిస్తూ వేస్తున్న అడుగులు ఎంత వరకు ఆంధ్రప్రదేశ్ యువతరాన్ని ప్రభావితం చేస్తాయో చూడాలి.


ట్విట్స్ :


మరింత సమాచారం తెలుసుకోండి: