తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాల బ్యూటీ సమంత.  క్యూట్ స్మైల్ తో ఇట్టే ఆకర్షించే సమంత తెలుగు, తమిళ ఇండస్ట్రీల అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేసులోకి వెళ్లింది. ఇక ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో తన సహనటుడు అయిన అక్కినేని నాగచైతన్య తో డీప్ గా లవ్ లో మునిగిపోయింది.  ఈ విషయం గత సంవత్సరం తనే బహిరంగ పరిచింది. తర్వాత ఇరు కుటుంబానికి చెందిన పెద్దలు ఓకే చెప్పడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకోని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  
Image result for samantha naga chaitanya
ఆ మద్య సమంత చేసిన కొన్ని చిలిపి పనుల వల్ల నాగ్ చాలా అసహనానికి గురై వార్నింగ్ ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా నాగ్ ఈ అమ్మడిపై మరోసారి ఫైర్ అయ్యారట.  అసలు విషయానికి వస్తే..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సమంత - నాగార్జునను సార్ అని పిలుస్తూ ఉండేది. ఇదే అలవాటు ప్రకారం ఎక్కడ చూసినా నాగ్ సార్ అంటూ పిలవడంతో నాగార్జున్ మరోసారి అసహనానికి గురయ్యారట.  ఒకప్పుడు సమంతకు తమకు ఎలాంటి సంబంధం లేదు కనుక సార్ అని సంభోదించేది..కానీ ఇప్పుడు తమ ఇంటి కోడలు కాబోతుంది..అలాంటపుడు సార్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని సమంతపై ఫైర్ అయ్యాడట.  
Image result for samantha naga chaitanya
'' నాగ్ సార్ '' అనే పిలుస్తుండటంతో ఇక ఊరుకునేది లేదు వెంటనే ఎదో ఒకటి తేల్చుకో అని గట్టిగా చెప్పాడట నాగార్జున. అలా అని నాగ్ ఈ వార్నింగ్ సీరియస్ గా ఇవ్వలేదట.. ఇంతకుముందు లా సార్ అంటే కుదరదు బాగుండదు కూడా అని సున్నితంగా చెప్పాడట నాగ్ . త్వరలోనే వివాహ నిశ్చితార్థం , ఆ తర్వాత నాగచైతన్య తో పెళ్లి కానుంది ఆ తర్వాతైనా నాగ్ ని మామయ్యా అని పిలుస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: