శాతకర్ణితో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్.. తన మొదటి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తున్న క్రిష్ శాతవాహన చక్రవర్తి చరిత్రను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు. అంతేకాదు నందమూరి బాలకృష్ణ వందవ సినిమా ఎలా ఉండాలో ఆ రేంజ్ తగ్గకుండా సినిమా రూపొందించారు. అసలు శాతకర్ణి సినిమా తీయాలన్న ఆలోచన క్రిష్ కు ఎలా వచ్చింది.. ఎప్పుడూ మొదలైంది అన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

 

తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక కథ చెప్పాలని తాపత్రయపడే డైరక్టర్ క్రిష్ తనకు శాతకర్ణి సినిమా మాత్రం 2011-12 ప్రాంతంలో కోటి లింగాల దగ్గర నాణెల ప్రదర్శన జరిగినప్పుడు శాలివాహనుల కథ తెలుసుకున్నానని.. అక్కడ నుండి శాతకర్ణి సినిమా తీసేందుకు ఆలోచన చేశానని చెప్పాడు. ఆ ఆలోచన రావడమే ఆల్స్యం శాతకర్ణిగా బాలయ్య మాత్రమే కరెక్ట్ అని ఆయన వందవ సినిమా రేసులో ఉన్నప్పుడు క్రిష్ కలవడం ఒప్పించి సినిమా తీయడం ఇప్పుడు విజయం సాధించడం అంతా జరిగింది.

 

మొదటి సినిమా నుండి క్రిష్ సినిమాలు మంచి సినిమాలు అన్న ముద్ర వేసుకున్నా సరే కమర్షియల్ గా మాత్రం క్రిష్ వర్క్ అవుట్ కాలేకపోయాడు. అయితే శాతకర్ణి సినిమా మాత్రం అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. బడ్జెట్ పరిధుల్లోనే తీసిన ఈ సినిమా క్రిష్ డైరక్షన్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. సో మొత్తానికి కోటి లింగాలలోని నాణేల ప్రదర్శన శాతకర్ణి సినిమా తీసేలా క్రిష్ ను ప్రోత్సహించిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: