బాహుబలితో రానా ఓ సూపర్ హీరో అయ్యాడు. సినిమాలో విలన్ అయినా సరే భళ్లాలదేవగా రానా మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబట్టి ప్రభాస్ తో పాటుగా క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఈ క్రమంలో సోలో హీరోగా కూడా రానా తన ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు హింది భాషల్లో ఘాజి సినిమా చేస్తున్న రానా ఓ పక్క తేజ డైరక్షన్లో మూవీ కూడా చేస్తున్నాడు.


ప్రస్తుతం డ్యాం కు సంబంధించిన సెట్స్ లో షూటింగ్ చేస్తున్న రానా మూవీకి సురేష్ బాబు కూడా నిర్మాతగా ఉన్నాడు. తేజ చెప్పిన లైన్ నచ్చడంతో నిర్మాతగా సురేష్ బాబు కూడా చేతులు కలిపాడు. రానా మార్కెట్ పెంచే దిశలో సురేష్ బాబు ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కన్నా ఎక్కువ పెట్టేస్తున్నారట. తేజ డైరక్షన్లో వచ్చిన హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడు. ఊళ్లో పాలిటిక్స్ మీద తన మార్క్ సెటైరికల్ టచ్ ఇవ్వబోతున్నాడట తేజ. మరి ఎప్పుడు లవ్ స్టోరీస్ నే తీసే తేజ ఈసారి కొత్తగా తీస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో తేజ మళ్లీ మంచి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: