జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో చెన్నైలోని మెరీనా బీచ్ తరహాలో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఎల్లుండి గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరగబోతున్న విధ్యార్దుల మౌన ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ తన సపోర్ట్ ను ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటికే పవన్ పిలుపుకు అనేకమంది యంగ్ హీరోలు స్పందించిన నేపధ్యంలో మేము కూడ పవన్ వెంటే అంటూ మెగా యంగ్ హీరోలు వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లు పవన్ మాటలకు బాసటగా నిలుస్తు ట్విట్స్ చేయడం అత్యంత సంచలనంగా మారింది.  

ఈమధ్య కాలంలో పవన్ కు మెగా కుటుంబానికీ దూరం బాగా పెరిగిపోతోంది అని కామెంట్స్ మరింత ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పవన్ పిలుపుకు బహిరంగంగా సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు సపోర్ట్ ఇవ్వడం వెనుక ఎత్తుగడ ఏమైనా ఉందా ? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఎల్లుండి విశాఖపట్నంలో స్పెషల్ స్టేటస్ కోసం జరగబోతున్న మౌన ప్రదర్శనకు పవన్ ను రావలసిందిగా విధ్యార్దుల నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ మద్దతు పలికిన ఈ విధ్యార్ధి ఉద్యమం ఎంత వరకు విజయవంతం అవుతుంది అన్న కోణంలో అనేక చర్చా కార్యక్రమాలు నిన్న రాత్రి అనేక న్యూస్ చానల్స్ నిర్వహించడంతో పవన్ నామస్మరణతో నిన్న చానల్స్ అన్నీ దద్దరిల్లిపోయాయి.  అయితే ఒక ప్రముఖ ఛానల్ ‘సార్ వస్తారా’ అంటూ నిర్వహించిన ఒక చర్చా గోష్టి కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు పవన్ బహిరంగంగా ఈ విధార్ది ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ‘జనసేనాను’ ఆంధ్ర ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం వస్తుంది అంటూ పవన్ రాకను ఆకాంక్షిస్తూ ఆ ఛానల్ కామెంట్స్ చేసింది.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాసం చాల తక్కువ అని అంటున్నారు.  ఈ కార్యక్రమం చిట్టచివరకు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు కాబట్టి కేవలం తన మాటల సపోర్ట్ తో ఈ విద్యార్ధుల మౌన ప్రదర్శనకు తన వంతు సహకారం అందించి ఆ తరువాత మారే పరిస్తుతులను బట్టి పవన్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: