పవన్ కళ్యాణ్  ఎల్లుండి విశాఖపట్నం ఆర్కే బీచ్‌ లో జరగా బోతున్నవిద్యార్ధుల మౌన నిరసన ప్రదర్శనలో ఎంతవరకు పాల్గొంటాడో ఇప్పటివరకు ఒక స్పష్టమైన క్లారిటీ రాకపోయినా ఈ ఆర్కే బీచ్‌  ఉద్యమమం ‘కాటమరాయుడు’ మూవీ ప్రమోషన్ కు అడ్డంగా మారింది. పవర్ ఫుల్ ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘కాటమరాయుడు’ మూవీ పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. 

న్యూ ఇయర్ ముందునుంచే  ఈమూ ప్రమోషన్స్ కూడ మొదలు పెట్టి వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీ టీజర్ రూపంలో ఇస్తామంటూ ప్రకటించిన ఈ సినిమా నిర్మాతలు ఈవిషయాన్ని ఆతరువాత  సంక్రాంతికి మార్చి చిట్టచివరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తాం అని చెప్పారు. 

కానీ ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం మేరకు అనివార్యకారణాల వల్ల  ఈ టీజర్‌విడుదల మళ్ళీ వాయిదా పడింది. అయితే దీనికి కారణాలు మాత్రం నిర్మాతలు వెల్లడించడంలేదు. ఏపీ ప్రత్యేక హోదా కోసం జనవరి 26నే విశాఖ ఆర్కే బీచ్‌లో ఆందోళన కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటున్నందునే టీజర్ విడుదలను వాయిదా వేసినట్టు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. 

జనవరి 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీచ్ సిటీ అయిన వైజాగ్ లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం మౌన పోరాటం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం ప్రశాంతంగా కొనసాగిస్తున్న నేపధ్యంలో దీనికి ‘జనసేన’ పార్టీ మద్దతు ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపధ్యంలో ఆ రోజు పవన్ అభిమానులి అలాగే విద్యార్ధులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఇక టీజర్ రిలీజ్ చేస్తే నైతికంగా బాగుండదు అన్న ఉద్దేశ్యంతో ఈ టీజర్ విడుదలను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనితో మళ్ళీ పవన్ అభిమానులు నిరాశ పడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: