వరస హిట్స్ తో దూసుకుపోతున్న అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.  ఈమె క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని టాలీవుడ్  టాప్ దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు.  ఈ క్రేజ్ తో ఆమె తన పారితోషికాన్ని చాల భారీగా పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిస్థుతులలో ఈమె వైపు మన టాప్ యంగ్ హీరోలు కూడ చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే నెల నుంచి మొదలు పెట్టబోతున్న చరణ్ సుకుమార్ ల లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కు అనుపమ హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.  ఈ విషయాన్ని గతంలో ఆమె తన ట్విటర్ లో కూడ తెలియచేసింది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమెను చరణ్ లేటెస్ట్ మూవీ నుండి తప్పించినట్లుగా గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేయడం ప్రారంభం అయింది.  ఈ గాసిప్పులకు బలం చేకూరుస్తు అనుపమ తన ట్విటర్ లో పెట్టిన ట్విట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఈ ట్విట్ చదివిన వారికి అనుపమ చరణ్ సుకుమార్ లను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్విట్ లా కనిపిస్తోంది. ‘నా గత జీవితాన్ని చూసుకుంటే నన్ను తిరస్కరించిన ప్రతి సందర్భంలోనూ నాకు మంచే జరిగింది. ఇలా తిరస్కరణకు గురి అయిన ప్రతిసారి నేను మరింత అభివృద్ధిని సాదిస్తున్నాను’ అంటూ చరణ్ సుకుమార్ ల పేర్లు చెప్పకపోయినా వారిని అన్యాపదేశంగా టార్గెట్ చేస్తూ అనుపమ పెట్టిన ట్విట్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

మెగా కుటుంబానికి మెగా హీరోలకు సమాధానం చెప్పి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికైనా కొనసాగడం కష్టం అని అనేకసార్లు కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో అనుపమ ధైర్యంగా చేసిన ఈ ట్విట్ పర్యవసానం ఎలా ఉంటుందో రానున్న రోజులలో తేలుతుంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: