నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలై బాలకృష్ణకు పేరుతో పాటు రికార్డులను కూడ తెచ్చి పెట్టింది. ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి గత వారం బాలకృష్ణ అమెరికా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బాలయ్య మూవీలు ఏవీ కూడ మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరని నేపధ్యంలో ఆ లోటును ‘శాతకర్ణి’ తీర్చడంతో అమెరికాలో బాలయ్యకు అభిమానులు బ్రహ్మరధం పట్టారు.

అయితే విశేషంగా వచ్చిన తన అభిమానులను చూసి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాప్ హీరోల అభిమానులను కార్నర్ చేసివిగా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.   బాలకృష్ణ ఆవేశంగా తన అభిమానులతో మాట్లాడుతూ ఏ హీరోకు లేనంత మంది అభిమానులు తనకున్నారని అంటూ ‘అభిమానులే నా బలం. నాకున్నంత మంది అభిమానులు తెలుగులో ఏ హీరోకు కూడా లేరు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంతేకాదు ‘ఇతర హీరోలకు భారీ అభిమాన గణమే ఉండి ఉండొచ్చు. కానీ, నా అభిమానులుగా రిజిస్టరైనంత మంది మాత్రం లేరు. నా అభిమానులతో పోలిస్తే వారికున్న అభిమానుల లెక్క సరితూగదు. మొత్తంగా నాకు 4,500 రిజిస్టర్డ్ ఫ్యాన్స్ క్లబ్బులు ఉన్నాయి. ఏ ఇతర హీరోకు అన్ని క్లబ్బులు లేవు’ అంటూ బాలకృష్ణ తన అభిమానులను ఆకాశంలోకి ఎత్తేస్తూ చేసిన కామెంట్స్ ఇతర హీరో అభిమానులు నోచ్చుకునేవిగా ఉన్నాయని అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా అమెరికాలో బాలకృష్ణ పర్యటించిన చాల ప్రదేశాలలో అభిమానులు శాతకర్ణి టీ-షర్టులు ధరించి, శాతకర్ణి జెండాలతో అలంకరించిన 150 కార్లతో భారీ ర్యాలీగా బాలయ్యను ఊరేగిస్తూ తీసుకు రావడమే కాకుండా  స్వాగత ద్వారం వద్ద పూలవర్షం కురిపించడం బాలయ్యకు అమెరికాలో ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇది ఇలా ఉండగా అమెరికాలోని బాలకృష్ణ వీరాభిమానులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి లక్ష డాలర్ల విరాళాన్ని అందించి బాలయ్య పట్ల తమ అభిమాన్నాన్ని చాటుకున్నారు. ఏది ఎలా ఉన్నా అమెరికాలోని బాలయ్య హవా ఏ స్థాయిలో ఉందో మరొకసారి నిరూపించబడింది..



మరింత సమాచారం తెలుసుకోండి: