పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పై ప్రస్తుతం నెటిజెన్లు సెటైర్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు మూవీలో నటిస్తున్నారు. ఒకవైపు మూవీలో నటిస్తూనే...మరోవైపు తను ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఇందుకోసం తనదైన కార్యచరణ చేసుకున్నారు.

ఇందలోని భాగంగానే ఈ నెల 26న వైజాగ్‌ ఆర్కె బీచ్‌ లో జరగనున్న ప్రత్యేక హోదా మౌన పోరాటానికి పవన్ ప్రమోషన్ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ట్రావెలింగ్‌ సోల్జర్ మీద కొనసాగిన ఈ సాంగ్‌ అంతా ఆకట్టుకునే విధంగా లేదని అంటున్నారు. పవన కళ్యాణ్‌ నటించిన సినిమాల్లోని సాంగ్స్ లో బాగా పాపులర్‌ అయిన ఈ ట్రావెలింగ్‌ సోల్జర్ సాంగ్‌ ని ఇప్పుడు ప్రత్యేకహోదా ప్రచారంలోనూ ఉపయోగించారు.

ఈపాటలో పవన్ కళ్యాణ్‌ గతంలో ప్రత్యేక హోదాపై జరిపిన బహిరంగ సభల్లోని మాటలనే ఇందులో ఉంచారు. యువతకి ఆకట్టుకునే విధంగా తన స్పీచ్‌ లోని మాటలను ఇందులో ఉంచారు. అయితే చాలా మంది ఈసాంగ్‌ అంత ఎట్రాక్టివ్‌ గా లేదని...పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఓ పూర్తి సాంగ్ ని రెడీ చేస్తే బాగుండేదని అంటున్నారు. తను రిలీజ్ చేసిన సాంగ్‌ అర్ధం లేని విదంగా ఉందని, ఇది ఉధ్యమ స్పూర్తికి వక్రీకరించేలా ఉందని అంటున్నారు.

ఇకనైనా పవన్ కళ్యాణ్‌ ఇలాంటి ఆలోచనలు కాకుండా, ప్రత్యేకమైన గీతాలను ప్రత్యేక హోదా కోసం కంపోజ్ చేయించాలని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ రిలీజ్ చేసిన సాంగ్ పై పలువురు సెటైర్స్ వేయటంతో ఇది కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: