రీమేక్ లపై మన తెలుగు హీరోలు తెగ మోజు చూపెడతారు అన్న విషయం తెలిసిందే. ఇప్పడు మన హీరోలు కూడ ఎల్లుండి విశాపట్నంలో జరగబోతున్న  ‘ప్రత్యేక హోదా’ విద్యార్ధుల మౌన నిరసన ప్రదర్శనను  తమిళ తంబీలు చెన్నై మెరీనాబీచ్ లో నిర్వహించిన జల్లికట్టు ఉద్యమానికి రిమేక్ గా మారుస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చెన్నైలో ఉద్యమం అనుకున్నదే తడవు తమిళ సినీ స్టార్స్ అంతా ఏకబిగువున మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. అంతేకాదు మెరీనా బీచ్ లోని ప్రదర్శన చేస్తున్న నిరసనకారుల దగ్గరకెళ్లి మరీ తమ సంఘీభావం తెలిపారు. అయితే మన యంగ్ హీరోలు మాత్రం ఎల్లుండి విశాఖపట్నంకు వస్తారో లేదో చెప్పకుండా కేవలం ట్విట్స్ పెట్టి సరిపెడుతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం మేరకు ఒక్క సందీప్ కిషన్ సంపూ బాబులు మాత్రమే తాము ప్ర్యత్యక్షంగా ఎల్లుండి విద్యార్ధులతో కలసి ఉద్యమంలో పాల్గొంటాము అని ప్రకటించారు. అయితే మిగతా హీరోల విషయంలో క్లారిటీ లేక పోవడంతో  మిగతా హీరోలు అంతా తమ సంఘీభావాన్ని ట్విట్స్ కే పరిమితం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్ ఎల్లుండి విశాఖపట్నంకు వస్తాడో ? రాడో అన్న విషయమై ఇప్పటికి క్లారిటీ లేకపోయినా తన ట్విట్స్ వేగం మాత్రం బాగా పెంచుతున్నాడు. “మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు, వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా, నీకు మాత్రం మేము పువ్వులనే ఇస్తున్నాం. ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించు, ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు” అంటూ  బావ యుక్తంగా ట్విట్స్ వేగం పెంచుతున్నాడు పవన్.  

అంతేకాదు “నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్ల లేకపోతే, అది నీగుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే ఆ పవిత్ర రక్తానికి నీవు ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో” అంటూ పవన్ చేస్తున్న  ట్వీట్స్ ఆంధ్రప్రదేశ్ లోని యువతరాన్ని ఎంత వరకు కదిలిస్తాయి అన్న సందేహాలు కూడ పవన్ వ్యతిరేకులు  కొందరు వ్యక్త పరుస్తున్నారు.  ఏది ఎలా చుసుకున్నా  ప్రస్తుతం మీడియాలోని కొన్ని వర్గాలు మాత్రం గణతంత్ర దినోత్సవం  రోజున విశాపట్నం ఆర్ కే బీచ్ లో జరగబోయే నిరసన  కార్యక్రం తమిళ రీమేక్ లా మారుతుందా  అన్న కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: