రెండు వరుస బ్లాక్ బస్టర్ మూవీలను అందుకున్న రచయితగా విజయేంద్రప్రసాద్ పేరు మారుమోగింది. దీంతో టాలీవుడ్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ కలానికి ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ డిమాండ్‌ క్రియేట్ అయింది. ఒకవైపు రైటర్ గా కొనసాగుతూనే మరోవైపు డైరెక్టర్ గా తనేంటో ప్రూవ్‌ చేసుకోవటానికి రెడీ అయ్యారు.


ఇందులో భాగంగానే విజయేంద్రప్రసాద్‌ డైరెక్ట్‌ చేసిన కమర్షియల్ చిత్రం శ్రీవల్లీ తాజాగా ఆడియో ఫంక్షన్ ని జరుపుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ విజయేంద్రప్రసాద్‌ మాట్లాడిన మాటలకు అందరూ షాక్‌ అవుతూ విన్నారు. ఏ ఒక్కరూ శబ్ధం చేయకుండా విన్నారు. ఒక రచయితగా స్టేజ్‌ మీదకి వచ్చి మాట్లాడిన విజయేంద్రప్రసాద్‌...ఇప్పుడు డైరెక్టర్ గా స్టేజ్‌ మీద మాట్లాడిన విజయేంద్రప్రసాద్‌ లో పూర్తిగా మార్పుని చూపించింది.


ఆడియో ఫంక్షన్స్ లో డైరెక్టర్స్ వారి సినిమాని బిజినెస్ పరంగా ప్రమోట్‌ చేసుకోవటానికి వేధికగా మారుతంది. కానీ విజయేంద్రప్రసాద్‌ ఈ ఫార్ములాకి విరుద్ధంగా ఉన్నట్టుగా తన స్పీచ్‌ ని చూస్తే అర్ధం అవుతుంది. తన మూవీని అబద్ధాలు చెప్పి అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పటం ఇక్కడ విశేషం. అంతే కాకుండా తను ఇప్పటి వరకూ ఏ రచయిత రాయలేని కథని, ఏ డైరెక్టర్ చేయని కథని తను టచ్‌ చేశానని చెప్పుకొచ్చారు.


తను మాట్లాడిన స్పీచ్‌ మొత్తం ఎమోషనల్ గా మాట్లాడటంతో..ఆడియో ఫంక్షన్ కి వచ్చిన వారంతా నిశ్శబ్ధంగా డైరెక్టర్ మాటలను మాత్రమే వినటం ఫంక్షన్ కి హైలెట్ గామారింది. ఓ కథని నమ్మి సినిమా తీసిన దర్శకుడు ప్రేక్షకులకు ఎంత వరకూ ప్రామిస్ చేయగలడో...అంత వరకూ మాత్రమే తను ప్రామిస్ చేస్తున్నానని చెప్పటం ఇక్కడ మరో విశేషంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: