నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉందని హడావిడి చేసినా అది కుదరలేదు. అయితే శాతకర్ణి విజయంతో క్రిష్ మీద భారీ నమ్మకం పెంచుకున్న బాలయ్య తనయుడి సినిమా భాధ్యతను కూడా అతని మీదే పెట్టాడని తెలుస్తుంది. అయితే ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ మోక్షజ్ఞను కూడా చారిత్రక సినిమాతోనే పరిచయం చేయాలని చూస్తున్నాడు.

 

అందుకే శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో సినిమా తీయాలని చూస్తున్నారట. అయితే శాతకర్ణి సినిమాలో కేవలం యుద్ధాల మీదే దృష్టి పెట్టిన క్రిష్ రాబోయే ఈ సినిమాలో ప్రేమకథకు ప్రాముఖ్యత ఇస్తాడట. పులుమావి, శ్రావణిల ప్రేమకథతో ప్రముఖ రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ శ్రావణి అనే నవల్ రాశారు. సినిమాను కూడా ఆ నవల ఆధారంగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

 

ప్రేమకథతో పాటుగా సినిమా చారిత్రాత్మక కథ కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంటుందని అంటున్నారు. సినిమా బడ్జెట్ కూడా ఈసారి పరిమితులు ఏమి లేకుండా గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికే నిర్మాత సాయి కొర్రపాటి మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మించేది తానే అని ఎనౌన్స్ చేశాడు. ఇక శ్రావణి నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సినిమా టైటిల్ కూడా శ్రావణి అని పెడతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: