విలక్షణ నటుడు సూర్య కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. అయితే ప్రస్తుతం సూర్య నటించిన సింగం-3 ఎస్-3 రిలీజ్ వాయిదా పడింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే ఫైనల్ గా ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 3కి సినిమా పోస్ట్ పోన్ చేశారు. అయితే అదే రోజు నాని నేను లోకల్ గా రాబోతున్నాడు.

 

నాని సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ కావాల్సింది షూటింగ్ లేటవడం వల్ల ఫిబ్రవరికి రిలీజ్ అనుకున్నారు. కాని ఫిబ్రవరి 3న సూర్య కూడా ఎస్-3 గా రాబోతున్నాడు. సింగం మొదటి రెండు సీరీస్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా వస్తుంది. ఇక ఓ పక్క వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నేను లోకల్ గా మళ్లీ తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేసేందుకు వస్తున్నాడు.

 

రెండు సినిమాల మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే సూర్య సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీనే.. పోలీస్ గా తన వీర ప్రతాపం చూపించడానికి ఎస్-3 లో సూర్య మరింత పవర్ఫుల్ గా వస్తున్నాడు. నాని కూడా లవర్ బోయ్ గానే కాదు నేను లోకల్ లో కాస్త మాసీ టచ్ కూడా ఇచ్చినట్టు ఉన్నాడు. మరి రెండు సినిమాల్లో ఏది విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: