మెగాస్టార్ పదేళ్ల తర్వాత వచ్చిన ఖైది నంబర్ 150తో మళ్లీ ఫాంలోకి తిరిగి వచ్చాడు. అయితే మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ కేవలం ఫ్యాన్స్ లోనే కాదు మెగా కాంపౌండ్ లో కూడా కొత్త నూతన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఖైది హిట్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 151, 152 సినిమాలకు డైరక్టర్స్ కు ఫిక్స్ చేసిన చిరు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చాడు.

 

మెగాస్టార్ 150వ సినిమా రేసులో వినాయక్ కన్నా ముందు రేసులో ఉన్నాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఆటో జాని అనే కథతో చిరు సినిమా ఉంటుందని అప్పట్లో మంచి హడావిడి జరిగింది. కాని మొదటి భాగం నచ్చి రెండో భాగం అంత సాటిస్ఫైడ్ గా లేదని ఆ కారణం చేత ఆ సినిమా చేయలేదు చిరు. ఇక తర్వాత కత్తి రీమేక్ గా చేయడం ఖైది నంబర్ 150గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం చూస్తున్నాం.

 

అయితే హిట్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు మళ్లీ చిరంజీవి పూరి కథ మీద కూడా దృష్టి పెట్టాడట. సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీనుల సినిమాల తర్వాత పూరితో ఆటో జాని కూడా చేసే అవకాశాలున్నాయట. పూరి మార్క్ మాస్ డైరక్టర్ కు చిరు లాంటి బాస్ కలిస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో ఊహించవచ్చు. మెగాస్టార్ ఛాన్స్ రాక దిగులుగా ఉన్న పూరికి ఇదో లక్కీ ఛాన్స్ అన్నట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: