యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ హిట్ తో మళ్లీ మంచి ఫాంలోకి వచ్చాడు. తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన తారక్ ఆ సినిమాలో తన లుక్ మాత్రమే కాదు తన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నాడు. అయితే తనలోని ఈ మార్పుకు కారణం తన భార్య ప్రణతి కారణం అంటున్నాడు జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రణతి వచ్చాక తన జీవితం మారిందని అంటున్నాడు.

 

కేవలం తన ఆలోచన ధోరణి మాత్రమే కాదు తన లుక్ విషయంలో కూడా తన ప్రభావం ఉందని అంటున్నాడు. ఇక సినిమాల మీద కూడా మరింత భాధ్యత పెరిగిందని.. జనతా గ్యారేజ్ సక్సెస్ తనలోని మార్పుకి కారణమని అన్నాడు తారక్. హీరోగానే కాదు స్నేహభావంలో కూడా తారక్ మంచి పేరుంది. తన స్నేహితులుగా ఉన్న వారికి తోచినంత సాయం చేయడంలో కూడా తారక్ వెనుకాడడు.  

 

హీరోలతోనే కాదు తన సహనటులతో స్నేహంగా ఉండే తారక్ భార్య మీద ప్రేమను కురిపించడం చూస్తే ముచ్చటేస్తుంది. తన తల్లి తర్వాత తన జీవితం మీద అంత ప్రభావితం చూపిన వ్యక్తిగా ప్రణతి గురించి మాట్లాడిన తారక్ తర్వాత సినిమాకు సంసిద్ధమవుతున్నాడు. బాబి డైరక్షన్ లో రాబోతున్న మూవీకి జై లవ కుశ టైటిల్ ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: