గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యతో పాటు నటించిన శ్రీయా శరణ్ తన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసిందని తెలిసిందే. వాశిష్ట మహాదేవిగా శ్రీయాను ఎందుకు తీసుకున్నారో సినిమాలో ఆమె కనబరచిన అభినయం చూసి అర్ధం చేసుకున్నారు. శాతకర్ణి సినిమాతో వచ్చిన ఈ క్రేజ్ ను అమ్మడు ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఓ హాట్ ఫోటో తో రెచ్చగొడుతుంది.

 

తన క్యూట్ లుక్స్ తో అలరిస్తున్న శ్రీయా తన హాట్ లుక్స్ తో చంపేస్తుంది.. ఈ పిక్ చూసిన వారెవ్వరు శ్రీయాను ఒక్కసారి చూసి చూపు మరల్చు కోరు. శాతకర్ణితో వచ్చిన మైలేజ్ ను ఇలాంటి హాట్ పిక్స్ తో ఇంకా పెంచుకోవాలని చూస్తుంది అమ్మడు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ పెయిర్ గా ఉన్న శ్రీయా ఈ సక్సెస్ తో మరిన్ని మంచి అవకాశాలను అందుకుంటుంది.

 

శాతకర్ణి సక్సెస్ తో బాలయ్య బాబే మళ్లీ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అనగా.. ఇంకా రెండు మూడు సినిమాల ఆఫర్లు చేజిక్కించుకుందట. ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా సరే శ్రీయా మాత్రం ఇంకా సూపర్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. మరి ఈ ఫోటో షూట్ లు ఎన్ని అవకాశాలు తెచ్చిపెడతాయో కాని అమ్మడి పిక్ మాత్రం సోషల్ సైట్స్ లో వైరల్ గా పాకుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: