అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టే క్రమంలో సమంతకు ఇదవరకు అంత అవకాశాలు రావట్లేదు అన్నది తెలిసిన విషయమే. వచ్చిన అవకాశాలను కొన్ని తాను కాదనగా మరికొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి సమంత నుండి చేజారుతున్నాయి. ఇదిలా ఉంటే సమంతకు ఓ లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. అది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అని అంటున్నారు.

 

చైతుతో లవ్ పీక్స్ లో ఉండగానే సినిమా ఛాన్సులు రావట్లేదని బాధ పడ్డ సమంత ఇక ఇరువురు కన్ఫాం చేశాక కొద్దిరోజుల వరకు సినిమా అవకాశాలు మందగించాయి. అయితే తెలుగులో క్రేజ్ ఉన్నా సరే మ్యారేజ్ ఫిక్స్ అయినా తమిళంలోనే రెండు అవకాశాలను అందుకుంది సమంత. విశాల్, శివ కార్తికేయన్ లతో జతకట్టబోతున్న సమంత ఇప్పుడు రాం చరణ్ తో జోడి కడుతుంది.  

 

ఇప్పటిదాకా స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత ప్రభాస్ రాం చరణ్ లతోనే నటించలేదు. సుకుమార్ సినిమాతో ఆ కోరిక తీరుతుంది. సుక్కు సినిమాలో హీరోయిన్ గా ముందు ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా సమంతకే ఓటేశారు. ధ్రువతో మేకోవర్ తో మంచి ఎనర్జిటిక్ గా ఉన్న చెర్రి సుకుమార్ సినిమాలో కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడట.    

  


మరింత సమాచారం తెలుసుకోండి: