తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాల భామ సమంత. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయ్యింది..తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించింది.  ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ టాక్ సంపాదించనవే కావడం మరో విశేషం.  ఇప్పటి వరకు అందరు హీరోలతో నటించిన ఈ అమ్మడు ఒక్క రాంచరణ్ సరసన మాత్రం నటించలేదు.   ధృవ సినిమా సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 30న లాంఛనంగా ప్రారంభించనున్నారు.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ఎంపిక జరగలేదు.   కాగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస విజయాలు సాధించి తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ చిత్రంలోను నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే చరణ్ సరసన అనుపను తీసుకోవాలని టాక్ వచ్చింది..కానీ ఇప్పుడు అది క్యాన్సల్ అయినట్లు తెలుస్తుంది.  
anupama raised the remuneration
దీని గల కారణం ఈ అమ్మడు రెమ్యూనరేషన్.. ఈ మద్య స్టార్ హీరోయిన్లు    రెమ్యూనరేషన్ తగ్గించుకుని 80 లక్షల రేంజులో పని చేస్తుంటే అనుపమ 60 లక్షలు అడగటంతోనే ఆమెను వద్దని డిసైడయ్యారని టాక్ వినిపిస్తోంది.  అంతే కాదు ఇప్పటి వరకు చెర్రీ సరసన సమంత నటించలేదు.
Image result for ram charan sukumar
ఆ మద్య ఎవడు, బ్రూస్లీ సినిమాలకు సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా వర్క్ అవుట్ కాలేదు.  మరి ఈ సినిమాకైన సమంత డేట్స్ ఇస్తుందా..? ఇప్పటికే తమిళ్లో రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది. వీటితో పాటు అఖిల్ వివాహం, తన ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్న సమంత.  మరి ఈ అమ్మడు చెర్రీ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: