ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో బ్రిటీష్ రాణి చేతులు మీదుగా ‘సర్’ బిరుదు పొందిన గొప్ప నటులు సర్ జాన్ హర్ట్ (77) కన్నుమూశారు. అనేక సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి జాన్ హర్ట్... సినీ ప్రేమికులను అలరించారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటీష్ రాణి ఆయనకు 2015లో 'సర్' సత్కారాన్ని అందించారు.   గత కొంత కాలంగా  జాన్ హర్ట్క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు.  
jhanu-hurt
హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. ఐకానిక్ పాత్రలతో అనేక ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఎలిఫెంట్ మ్యాన్, ఏలియన్, హ్యారీ పాటర్ సిరీస్ , హెర్య్కులస్, తదితర ప్రఖ్యాత సినిమాల ద్వారా ప్రపంచసినీ ప్రేక్షకులకు షభాష్ అనిపించుకున్నారు.  
ప్రపంచ ప్రఖ్యాత నటుడు జాన్ హర్ట్ కన్నుమూత
అనేక రివార్డులు, అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఏలియన్, ఎలిఫెంట్ మ్యాన్, హెర్క్యులస్, ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్ తదితర సినిమాలలో ఆయన నటించారు. ఆయన మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, పలువురు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: