సంబంధిత చిత్రం

బాలీవుడ్ బృహత్తర కథానాయికలైన హేమమాలిని, రేఖ తొలుత తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారన్న విషయం పెద్దగా ఈ తరం వాళ్ళకే కాదు ఆ తరం వాళ్ళకీ చాలా తక్కువ మాత్రమే తెలుసు. వెండితెరపై వారు వెలుగులు చిందించారు. దక్షిణ భారత చిత్రసీమ నుండి తొలిసారి బాలీవుడ్లో ప్రవేశించి బాలీవుడ్ సినీ రంగాన్ని ప్రసిద్ధ నటీమణులై మహారాణులై  దశాబ్ధాలపాటు ఏకచత్రాధిపత్యంగా ఏలారు.

సంబంధిత చిత్రం

వీరిద్ధరూ ప్రసిద్ధ నృత్యకారిణులుగానే కాక విశిష్ట విభిన్న ఆకర్షణీయమైన వ్యక్తిత్వము కలిగి ఉండటం వీరి మధ్య పోలికలకు కారణం. రేఖ రంగులరాట్నం అనే  తెలుగుచిత్రం లో ఒక చిన్న బాలిక పాత్రలో నటించటానికి రంగ ప్రవేశం చేసింది. తరవాత రాజకుమార్ కథానాయకుడుగా నటించిన కన్నడ సినిమాలో కథానాయిక గా నటించింది. ఆ తరవాతే బాలీవుడ్లో ప్రవేసించి తానేవరో నిరూపించుకొనే క్రమంలోనే ప్రసిద్ద కథానాయకిగా తనని తాను నిరూపించుకుంది.


సంబంధిత చిత్రం

అలాగే సౌందర్యరాశి నాటి యువతకు కలలసుందరి (డ్రీంగర్ల్) గా ఇప్పటికీ నిలిచిపోవటానికి ముందు తొలిసారిగా 1965 లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు అనంతమైన పేరుతెచ్చిపెట్టిన పౌరాణిక చిత్రరాజం పాండవ వనవాసంలో "మొగలి రేకుల సిగదానా" అనే కౌరవుల ఘోషయాత్ర శిబిరం ముందు నృత్యం చేసింది.


చాలాకాలం తరవాత తన నృత్యదాహం తీర్చుకోవటానికి  1971 లో నిర్మించిన 'శ్రీకృష్ణ విజయం' సినిమాలో రామారావు శ్రీకృష్ణుడు గా ఇంద్రసభలో ఉన్నప్పుడు "జోహారు శిఖిపించ మౌళీ"  అనే గీతికలో అపూర్వంగా నృత్తించింది. అదొక అద్భుత సన్నివేశం, మరపురాని నృత్య గాన సంగీత దృశ్య సాహిత్యం.  ఆమె అద్భుతంగా నటించిన నృత్యం ప్రేక్షకుల కరతాళద్వనులతో మార్మోగింది.

rekha hd image కోసం చిత్ర ఫలితం

1968 లో ఆమె బాలీవుడ్ "స్వప్నోన్ కా సౌధాఘర్" సినిమాతో ప్రవేసించి ఒక మహోన్నత కథానాయిగా వెనక్కి చూడకుండా ఎదిగిపోయింది. ఆమె దేహం రూపం - సౌందర్య సౌకుమార్యాలకు కణాచి.


ఈ ఇద్దరు కథానాయికలు బాలీవుడ్ చిత్రసీమలో 330  సినిమాల్లో నటించారు. అంతే కాక నటనకే నేటికీ "స్టైల్ ఐకన్స్" గా (శైలికి అద్భుత చిహ్నాలు) ఇప్పటికీ నిలిచిపోయారు. నటన, నృత్యంలో వారి శైలికి ప్రత్యామ్నాయా లు ఇప్పటివరకూ ఏర్పడలేదు.


hema dharmendra hd images కోసం చిత్ర ఫలితం

యువత హృదయస్పందనై గట్టిగా చెప్పాలంటే వయస్సు భేదం లేకుండా పురుషులందరి హృదయసామాజ్ఞి లై ఏలేశారు. ఇప్పటికీ ఇంటెర్నెట్ లో అత్యధికంగా వెనకబడుతూనే ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో వీరి ఫొటోలు, వీడియోలు షేర్ అవ్వటం ప్రింట్ చేసుకోవటం జరుగుతునే ఉంది. మహారాణులు ఒక శకాన్ని పరి పాలిస్తే వీళ్ళు యువహృదయాల్లో గత అర్ధ శతాబ్ధం నుండీ తిష్ఠ వేసుకుని కూర్చున్నారు.


సంబంధిత చిత్రం

ఇంత సినిమా లైఫ్ స్పాన్ చాలా తక్కువమంది హీరోలకు మాత్రమే ఉంది. సాధారణంగా సినీ రంగములో మహిళల లైఫ్-స్పాన్ చాలా తక్కువ అంటారు. వీరి తరవాత ఆ పొజిషన్ ఎంజోయ్ చేసింది శ్రీదేవి- జయప్రద లకే ఉంది. దక్షిణాదిన జన్మించిన ఈ నిత్య యువతీమణులకు ప్రాంత రాష్ట్ర భాషాభేదం లేకుండా ఇండియా-వన్ లాగా యువహృద యాలను కబ్జా చేసిన చరిత్ర వీరిది. గమ్మత్తేమంటే దక్షినాత్యులైన అమ్మాయిలకే ఈ దేశం యువత మొత్తం బ్రహ్మరథం పట్టటం జరుగు తుంది.


pandava vanavasam hema malini hd images కోసం చిత్ర ఫలితం

హృదయాలను దోచుకుని హృదయరాణులైన  వీరు పుట్టింది అక్టొబర్ నెలలోనే అదీ అతిదగ్గరగా. రేఖ జన్మ దినం 10 అక్టొబర్ కాగా, 16 అక్టొబర్ న  హేమమాలిని జన్మించారు. అన్నింటిని మించి ఇద్దరు సిట్టింగ్ పార్ల మెంట్ మెంబర్లు" గా ఉన్నారు.


ఇద్దరు తమిళనాడులోనే పుట్టారు. భరతనాట్యంలో నిష్ణాతురాలైన హేమమాలిని చక్రవర్తి జయల దంపతులకు తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలోని అమ్మన్ కూడి లో 16 అక్టోబర్ 1948 న జన్మించగా - భాను రెఖగా పూర్తి పేరుతో ప్రఖ్యాత తమిళ నటుడు జెమిని గణెషన్ కు తెలుగునటి పుష్పవల్లికి 10, అక్టొబర్ 1954 న మద్రాస్ లో జన్మించారు.   


సంబంధిత చిత్రం

“చరిత్ర” అంటే ఇష్టపడే హేమమాలిని డిల్లీలో 10వ తరగతివరకే చదువుకొని నటిగా అవకాశాలు రావటంతో చిన్నవయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. కుటుంబం లో ఇద్దరు సోదరుల తరవాత చిన్నదిగా పుట్టిన హేమ బాల్యంలోని మాధుర్యాన్ని చక్కగా అనుభవించి తల్లిచాటు బిడ్డగా సంపూర్ణ సంరక్షణ లో పెరిగింది. యవ్వనములో ప్రేమ ఈమే జీవితాన్ని మలుపులు తిప్పింది.


పది సంవత్సరాల వయసులోనే తమ కుటుంబములో ఏర్పడ్డ సంఘటనలు రెఖను "అంతర్ముఖి" లేదా ఇంట్రావర్ట్ గా మార్చగా ఆమె "టాం-బోయ్" గా అమ్మాయిలకు దూరంగా పెరుగుతూ వచ్చింది. తన తండ్రికి అనేకమంది మహిళలతో ఉన్న రిలేషన్సే ఆమెను ఒకరకమైన మానసిక ఇబ్బందులకు గురిచేసింది ఆమె బాల్యం. ఆ మానసిక సమస్యే ఆమెను తన సహచర విద్యార్ధులకు, స్నేహితులకు దూరంగా ఉండేలా చేసింది.

సంబంధిత చిత్రం

తొలినాటి నుండి భరత నాట్యకళాకారిణైన హేమమాలిని 1965 లో ఒక తెలుగు నృత్యగీతం లో నటించింది. ప్రముఖ దర్శకుడు శ్రీధర్ చాలా సన్నగా పీలగా ఉందని ఆమెను కథానాయకిగా ఎంపిక చేయటానికి తిరస్కరించటం ఆమెలో పట్టుదల పెరిగింది. ఫలితంగా - విశ్వవిఖ్యాత నటదర్శకుడు రాజ్-కపూర్ ఆమెను సప్నోన్ కా  సౌధాగర్ చిత్రం ద్వారా 1968 లో హిందీ చలనచిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసారు. అదీ ఆమె జీవితంలో అద్భుతమైన మలుపు టర్నింగ్-పాయింట్. తొలి సినిమా ఆర్ధిక విజయం సాధించక పోయినా “డ్రీంగర్ల్”  గా హేమమాలిని పేరు దేశంలో మార్మోగిపోయింది.


ఐదు దశాబ్ధాలు సుధీర్ఘ సినీ జీవితంలో హేమమాలిని నాటి సూపర్-స్టార్ రాజేష్ ఖన్నా, శశికపూర్ ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్ రాజ్ కుమార్ దేవానంద్ లాంటి హేమాహెమీలతో నీవా నేనా అన్నట్లు నటించిన లెజెండరీ కథానాయిక 150 సినిమాలలలో నటించింది. నాటి సూపర్ స్టార్స్ రాజేష్ ఖన్నాతో 10, ధర్మేంద్రతో 35  సినిమాల్లో జంటగా నటించి హిట్ పెయిరింగ్ ను యిచ్చింది. హేమమాలిని దర్శకురాలుగా నిర్మాతగా తనను తాను ఋజువు చేసుకుంది. టెలివిజన్ సీరియల్ నూపూర్ ఆమె దర్శకురాలు.

rekha hd image కోసం చిత్ర ఫలితం

ఆమె నటనకు సీతా ఔర్ గీత, జానీ మేరా నాం, అందాజ్, సత్తే పె సత్తా, లాల్ పత్తర్, షోలే, ప్రేం నగర్, ధిల్లగీ, కినారా, హం దోనోం, రాజ్ పుత్, బాగ్ బన్ లాంటి సినిమాలే గీటురాళ్ళు. 


రేఖ జీవితమే సినిమా గా చెప్పొచ్చు. తల్లి తండ్రులు ఇద్దరు మహానటులు అవ్వటంతో ఆమె రక్తమంతా నటనతోనే నిండి పోయింది. స్కూల్ వదిలి సినిమాలోనే చేరిపోయింది రేఖ. 1966 లో రంగులరాట్నం తెలుగుసినిమాలో బాలనటిగా నటించిన రేఖ బాలీవుడ్ లో ప్రవేసించక ముందు రేఖ కన్నడ తెలుగు తమిళ సినిమాల్లో కథానాయకిగా నటించింది. 1970 లో సావన్ బాదోం సినిమాలో నవీన్ నిశ్చల్ తో కథానాయకిగా చిత్రరంగ ప్రవేశం చేసింది రేఖ. ఆ సినిమా అద్భుత విజయమే ఆమెను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. తరవాత 1976 లో "దో అంజానే" సినిమా లో అమితాబ్ బచ్చన్ కథానాయకుడు ఆమే కీర్తి చంద్రికలు దేశవ్యాప్తం చేశాయి. అందులో ఆమె పాత్ర కీలకం. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్సే. కహానీ కిస్మత్ కి, రాంపూర్ కా లక్ష్మన్, నాగిన్, ముఖద్దర్ కా సికందర్, మిస్టర్ నట్వర్లాల్, ఉమ్రావ్-జాన్, ఖూన్ భరి మాంగ్ ఆమెకెంతో కీర్తి ప్రతిషటలు తెచ్చిపెట్టాయి.


rekha hd image కోసం చిత్ర ఫలితం

తొలి రోజుల్లో ఆమె రూపం, రంగు, బరువు, హిందీ మాట్లాడ లేక పోవటం ఇవన్నీ ఆమెకు బాలీవుడ్ లో ఆటంకాలుగా నిలిచినా - వీటిని అధిగమించటంలో ఆమె చాలా క్లిష్టతరమైన యోగా వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకుంది. తన రంగుతొనే బాలీవుడ్ కే "బ్లాక్-బ్యూటీ" గా కీర్తి చంద్రిక లందుకుంది. హిందీలో అనర్ఘళంగా మాట్లాడే తర్ఫీదు పొందింది. నట్యం నేర్చుకుని నాట్యమయూరే అయింది. క్రమంగా విజయమనే విచ్చన లెక్కుతూ బాలీవుడ్ అనే పరమపద సోఫాన పటంలో అత్యద్భుత అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది. అంతే కాదు దాదాపు రేఖ సినిమాలు ఇండస్ట్రీ-హిట్సే.


అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, మనోజ్ బాజ్పాయ్ లాంటి యువ నటులతో ఆమె తన నటనా నైపుణ్యంతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఇచ్చిన హిట్స్ సినిమా బాల్వెవుడ్ కే హైలైట్స్. టాలీవుడ్ లో ఒక శకాన్ని శాసించిన తన పినతల్లి సావిత్రిని మరిపించేలా బాలీవుడ్లో ఒక ఉవ్వెత్తున ఎగసిపడ్డ (పడిపోలేదు) ఉత్తుంగ తరంగమే అయింది రేఖ.


pandava vanavasam hema malini hd images కోసం చిత్ర ఫలితం

రేఖ నటించిన సుమారు 180 సినిమాల్లో ఎక్కువ భాగం మహిళా ప్రధాన పాత్రలే పోషించింది. మెయిన్ స్ట్రీం సినిమాల్లో నటిస్తూనే సమాంతరంగా సామాజిక ప్రయోజనమున్న సినిమాల్లోనూ నటించి మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించింది రేఖ. ఉత్తమ కథానాయికగా రెండు సార్లు, మరోసారి ఉత్తమ సహాయ నటిగా ఫిలిం ఫేర్ అవార్డులు పొంది గుర్తించబడ్డారు రేఖ. ఉమ్రావ్-జాన్ సినిమాలో నగర్-వధు లేదా సభా-రంజని పాత్రకు ప్రాణం పోసినందుకు గాను జాతీయ ఉత్తమ నటి గౌరవం పొందింది. 2010 లో భారత పౌర పురస్కారం "పద్మశ్రీ" ని రాష్ట్రపతి నుండి స్వీకరించారు.  3 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక జీవిత సాఫల్య పురస్కారం, ఒక జాతీయ ఉత్తమ నటి అవార్డ్, ఉత్తమ వెండితెర ప్రతినాయకి అవార్డ్ స్టార్ నుండి, దీనానాధ్ మంగేష్కర్ అవార్డ్, జీ సినిమా నుండి జీవన సాఫల్య పురస్కారం, మాక్స్ స్టార్ డస్ట్ నుండి రోల్ మోడల్ అవార్డ్, సోని నుండి గోల్డెన్ గ్లోరీ అవార్డ్, మహ నుండి స్టైల్ ఐకన్ అవార్డ్ ఇలా ఎన్నో గౌరవ పురస్కారాలు పొందారు రేఖ, 2014 లో రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు.


rekha hd image కోసం చిత్ర ఫలితం

హేమమాలిని నాటి యువత కలలరాణి. "డ్రీం-గర్ల్ అనే జనమిచ్చిన బ్రాండ్-నేం" ఇండియా ఆ సేతు సీతా చలం అంతా మార్మోగుతుంది. 1977 లో "డ్రీం-గర్ల్" సినిమాలో కూడా నటించిన హేమమాలిని 11సార్లు ఫిలింఫేర్ బెస్ట్ హిరోయిన్ అవార్డ్స్ గెలుచుకుంది. 1972లో తొలి సారి గీతా ఔర్ గీత సినిమాకు బెస్ట్-హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డ్ గెలుచుకుంది. 2000 సంవత్సరంలో ఫిలింఫేర్ నుండి జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్) అందుకుని తన నటనకు జీవిత కాలపు గుర్తింపు తెచ్చుకుంది. అదే సంవత్సరం నాలుగవ అతిపెద్ద పౌరపురస్కారం "పద్మశ్రీ" ని రాష్ట్రపతి నుండి స్వీకరించారు.


rekha hd image కోసం చిత్ర ఫలితం


2012 లో సినీ రంగానికి హేమ చేసిన సేవలకు పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డ్ నిచ్చి ఆమెను సత్కరించింది. 2003 -2009 పీరియడ్ కు రాష్ట్రపతి నామినీగా నాటి భారత రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం గారిచే రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఆ సమయము లో అంటే 2004 లో భారతీయ జనతా పార్టి ద్వారా రాజకీయరంగములో చేరి 2010 లో ఆ పార్టీకి జనరల్ సెక్రెటరిగా నియమించబడి ఆ పార్టీ విజయానికి అవిరళ కృషి తో ఆ పార్టీకి సేవచేస్తున్నారు. 2014 లో ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గం నుండి 330000 పైగా ఓట్ల మెజారిటీ తో గెలిచి యూ.పీ లో బిజెపి రాజకీయాలకే ఒక బలమైన ప్రోత్సాహమిచ్చారు.


hema dharmendra hd images కోసం చిత్ర ఫలితం

సంజీవ్ కుమార్, జితేంద్రల ప్రేమను నిరాకరించి హేమమాలిని 1979 లో తన సహనటుడు ధర్మేంద్ర ను వివాహం చేసుకుని ఈష,అహానా లకు తల్లైంది. తల్లీ ఇద్దరు కూతుళ్ళు భరతనాట్యములో నిష్నాతులై అనేక వెదికలపై నర్తించారు. నర్తిస్తూనే ఉన్నారు. వీరి నృత్యం అద్భుత రమణీయంగా పేరుపొందారు. 2005లో “దివా అన్వీల్డ్” పేరుతో హేమమాలిని జీవితచరిత్రను ప్రముఖ రచయిత రాంకమల్ ముఖర్జీ ప్రచురించారు.


రేఖ వివాహ జీవితం డిల్లీ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్ తో ప్రారంభమైనా రేఖ విదేశాల్లో ఉన్నప్పుడు ముఖేష్ ఆత్మహత్యతో చేసుకోవటంతో ఆ బంధం అనెక అనుమానాలు అపార్ధాలతో ముగిసిపోయింది. అంతేకాదు రెఖకు అమితాబ్ బచ్చన్ తో అతి దగ్గర సంభందాలున్నట్లు బహుళ ప్రచారములో ఉంది. శిల్-శిలా సినిమా వారు నటించిన చివరి సినిమా. ఆ సినిమాతోనే వారి ప్రేమ విచ్చిన్నమై పోయింది.

sri krishna vijayam hema malini hd images కోసం చిత్ర ఫలితం

ఇదీ దాదాపు దగ్గర పోలికలతో ఉన్న డ్రీం-గర్ల్ హేమమాలిని - సూపర్ యాక్ట్రెస్ రెఖల కథలు. అంతా ఫాంటసీగా ఉన్నాయి కదా! మనమంతా వారి జీవితమంతా అహ్లాదకరంగా ఆనందంగా ఉండాలని విష్ చేద్ధాం.


hema rekha as best friends hd images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: