సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, బ్రిటిష్‌ భామ అమీజాక్స‌న్ జంటగా న‌టిస్తోన్న రోబో 2.0 సినిమా శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటోంది. అయితే, అమీజాక్స‌న్ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..తమిళనాడులోని చెన్నైలో అడుగుపెడితే అంతా సూపర్‌స్టార్‌ రజనీకాంతే కనిపిస్తారని కథానాయిక అమీజాక్సన్‌ అన్నారు. ‘చెన్నైలో అడుగుపెడితే అంతా రజనీకాంతే కనిపిస్తారు. ప్రపంచం ఆయన్ను సూపర్‌ హ్యూమన్‌ అనుకోవడం కరెక్ట్‌. రజనీ మంచి నటుడు, దయకలిగిన వ్యక్తి..



ఆయన విజయాన్ని మనం లెక్కకట్టలేం. ఆయనతో ఓ చిన్న సంభాషణ జరిపినా.. జీవితంలో కృతజ్ఞతాభావానికి ఉన్న విలువ తెలుస్తుంది. ర‌జనీని సూపర్‌ హ్యూమన్‌ అనుకోవడం కరెక్ట్ అని పేర్కొంది. ఆయ‌న ఒక మంచి న‌టుడే కాకుండా ద‌య‌క‌లిగిన వ్య‌క్త‌ని ఆమె కొనియాడింది. ఆయన విజయాన్ని మనం లెక్కకట్టలేమ‌ని పేర్కొంది. రజనీ ముందు నటించడమంటే కష్టమే.. కానీ ఆయన భయపెట్టే వ్యక్తి కారు. శ్రద్ధ తీసుకుని చెప్పే వ్యక్తి’ అన్నారు.



బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమలో ఉంద‌ని ఇటీవ‌ల వ‌చ్చిన పుకార్ల‌పై ఆమె కూడా అమీజాక్స‌న్ ఈ సంద‌ర్భంగా స్పందించింది. ఇటీవ‌ల జ‌రిగిన‌ ‘2.0’ ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమానికి స‌ల్మాన్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాను న‌టిస్తోన్న చిత్రం ప్రతిష్ఠాత్మకమైన‌దని అందుకే సల్మాన్‌ సపోర్ట్‌ చేశారని తాను అనుకుంటున్నాన‌ని ఆమె చెప్పింది. ఆయన చూపిన ఆదరణ అద్భుతం. సల్మాన్‌ గొప్ప నటుడు, పెద్ద స్టార్‌. ‘కిక్‌’లో సల్మాన్‌తో నటించే అవకాశం వచ్చింది. కానీ ‘ఐ’ చిత్రం వల్ల అందులో నటించలేకపోయా. సల్మాన్‌తో కలిసి పనిచేయాలన్నది నా కల’ అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: