బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్వాంటికో ఆఫర్ రాగానే మొదటి పార్ట్ లో రెచ్చిపోయిన ప్రియాంకా సీరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు వెంటనే రెండో సీరీస్ లో కూడా స్థానం సంపాదించుకుంది. అయితే మొదటి సీరీస్ తో పోల్చుకుంటే రెండో సీరీస్ అంతగా క్లిక్ అవ్వలేదు.


ఇక ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు గ్యాప్ లేకుండా మూడో సీరీస్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూడో సీరీస్ ను చాలా తక్కువమంది చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి మొదటి సీరీస్ లో ప్రియాంకా అందాలను ఎంజాయ్ చేసిన ఫారిన్ ఆడియెన్స్ రెండు సీరీస్ లకే ఆమె బోర్ కొట్టేసింది అనుకుంటా అందుకే క్వాంటికో సీరీస్ లను ఇక ఆపేసేద్దామని నిర్ణయించుకున్నారట.


అసలైతే వ్యూయర్ షిప్ బాగుంటే సండే వచ్చే ఈ ప్రోగ్రాం మూడో సీరీస్ ను సండే నుండి మండే కు షెడ్యూల్ చేంజ్ చేశారట. క్వాంటికోతో వచ్చిన ఇమేజ్ ను ఇంకా కొన్ని సీరియల్స్ కు వాడుకుందాం అనుకున్న ప్రియాంకా ఆలోచనలకు పెద్ద షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. చేసిన మూడు సీరీస్ లలో ప్రియాంకా మాత్రం బాలీవుడ్ సినిమాల్లో చేయని హాట్ సీన్స్ చేసి మెప్పించింది. అమ్మడి అందాలు అప్పుడే ఆంగ్ల ప్రేక్షకులకు బోర్ కొట్టాయో ఏమో కాని ప్రస్తుతం ప్రియాంకా ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: