ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కొత్త లుక్స్ కోసం తెగ ఆరాటపడుతున్నారు.  ఇప్పటికే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ మొదటి నుంచి చాలా స్టైలిష్ గా కనిపించడం అలవాటు. మాస్ హీరో లుకింగ్ ఉన్నా, కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి.   గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బన్నీ తన తర్వాత సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.  
Image result for duvvada jagannadham first look
తాజాగా బన్నీ నటిస్గున్న ‘దువ్వాడ జగన్నాధమ్ ’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం.  గత కొంత కాలంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై ఎన్నో అంచనాలు పెరుగుతూ వచ్చాయి.   తాజాగా బన్నీ దువ్వాడ జగన్నాధమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఇందులో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడి గా డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం లో మరో పాత్ర పూర్తిగా స్టైలిష్ గా ఉంటుందట. అయితే గతంలో ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చేసిన విషయం తెలిసిందే.

కాగా అందులో బ్రాహ్మణ యువకుడి గా ఒక పాత్రలో నటించగా మరొక పాత్ర మాస్ ని అలరించేలా మొత్తంగా ద్విపాత్రాభినయం చేసాడు . వివివినాయక్ దర్శకత్వంలో రూపొందిన అదుర్స్ సూపర్ హిట్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం పోషిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి దువ్వాడ జగన్నాధమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: