పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్నలకు ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు అంతా కలవరపడుతూ ఉంటే కొంతమంది బయ్యర్లు పవన్ నటించిన ‘కాటమరాయుడు’ మూవీని వ్యూహాత్మకంగా కార్నర్ చేస్తూ ఎత్తుగడలు వేస్తున్నారు అంటూ గాసిప్పులు రావడం ప్రస్తుతం ఫిలింనగర్ కు హాట్ న్యుస్స్ గా మారింది.  ఆశక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలలో భయంకరమైన ఫ్లాప్ గా మారిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్లు ‘కాటమరాయుడు’ మూవీకి అనుకోని సమస్యలు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ‘సర్దార్’ 50 కోట్ల కలక్షన్స్ తెచ్చుకున్నా ఆమూవీ బయ్యర్లు మాత్రం భయంకరంగా నష్టపోయారు. దీనికికారణం ఈసినిమా పై వారు పెట్టిన భారీపెట్టుబడులు. 

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వల్ల ఈసినిమాను కొనుక్కున్న ఒక్క నైజాం డిస్ట్రిబ్యూటర్ కు 8కోట్లు నష్టం వచ్చింది అని వార్తలు వచ్చాయి అంటే ఈసినిమా వల్ల ఇంకా ఎందరు డిస్ట్రిబ్యూటర్స్ ఎంతగా నష్టపోయారో తెలుస్తుంది.  అయితే ఈసినిమాను నిర్మించిన శరత్ మరార్ తనకు ఈ నష్టంతో సంబంధం లేదని లాభానష్టాలతో సంబంధంలేని ఎగ్రిమెంట్ తో తాము ఈమూవీని బయ్యర్లకు అమ్మడం జరిగింది అన్నవాదనను అప్పట్లో శరత్ మరార్ వినిపించాడు అని టాక్.

అయితే ఈనష్టాల వివాదం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో బయ్యర్ల నష్టాలను చూసి చలించిపోయిన పవన్ ‘కాటమరాయుడు’ మూవీని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్లకు తక్కువ రేటుకు శరత్ మరార్ ద్వారా అమ్మిస్తానని మాట ఇవ్వడంతో ఆవివాదం అప్పట్లో ముగిసిపోయింది. అయితే శరత్ మరార్ ‘కాటమరాయుడు’ మూవీని ‘సర్దార్’ బయ్యర్లకు కాకుండా కనీవినీ ఎరుగని రేట్లకు బయట వేరే బయ్యర్లకు అమ్మడం జరిగింది అని అంటున్నారు. 

ఈవిషయాలు తెలుసుకుని షాక్ అయిన ‘సర్దార్’ బయ్యర్లు శరత్ మరార్ ను అలాగే పవన్ కళ్యాణ్ ను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వారి అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో అసహనంతో ఉన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్లు పోరుబాట పట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈవిషయమై శరత్ మరార్ సరిగ్గా స్పందించకుండా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి శరత్ మరార్ ను అదేవిధంగా మాటఇచ్చిన పవన్ ను కార్నర్ చేసే విధంగా ‘సర్దార్’ బయ్యర్లు ఎత్తుగడ వేస్తున్నట్లు గాసిప్పులు వినపడుతున్నాయి.  ఈవార్తలే నిజం అయితే శరత్ మరార్ పవన్ లకు ‘సర్దార్’ బయ్యర్ల నుండి కొత్త సమస్యలు మీడియాకు హాట్ న్యూస్ కు రంగం సిద్ధం అవుతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: