ప్రస్తుతం మెగాహీరోలలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలు ఎక్కువ చిత్రాలను చేస్తున్నారు. సంవత్సరానికి కనీసం 2  చిత్రాలను రిలీజ్ చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సాధ్యమైతే 3 చిత్రాలను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ల ఆలోచనగా కనిపిస్తుంది. అయితే వీరిద్దరిలో వరుణ్ తేజ్ చాలా నిబద్ధతో సినిమాలలో నటిస్తున్నారు.


అయితే కొన్ని మంచి చిత్రాలలో వరుణ్ తేజ్ నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ అనేది రాలేదు. ఇక ఫైనాన్షియల్ గా వరుణ్ తేజ్ బలంగా మారటానికి వరుస సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. అందుకే మంచి కథలతో ఉన్న సినిమాలని సెలక్ట్ చేసుకుంటూ వరుస చిత్రాలకి సంబంధించిన షూటింగ్స్ ని ప్రొగ్రెస్ లో ఉంచుతున్నారు.


ఇక 2016 లో రిలీజైన ‘లోఫర్’ తర్వాత దాదాపు సంవత్సరం పైగానే వరుణ్ తేజ్ గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇంత గ్యాప్ ని ఇంకెప్పుడూ రాకుండా ఉండేందుకు ఈసారి వరుణ్ తేజ్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. అందుకే మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘ఫిధా’ చిత్రాల్లో ఏకకాలంలో నటిస్తున్నారు.


ఈ సినిమాల కోసం పని చేస్తూ తీరికలేని సమయాన్ని వరుణ్ తేజ్ గడుపుతున్నారు. రెస్ట్ లేకుండా వరుస సినిమాలు చేస్తేనే స్టార్ డం అనేది వస్తుంది. ఏ సినిమా ఎప్పడు?ఎందుకు హిట్టవుతుందో? అనేది ఒక్క ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందనేది వరుణ్ తేజ్ కి తండ్రి చెప్పిన పాఠం అని అంటున్నారు. అందుకే తండ్రి కోరక మేరకు వరుణ్ తేజ్ తన చిత్రాలతో బిజీగా మారారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: