టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి వ‌చ్చే ఆఫర్స్ ఏ ఇండస్ట్రీలో కనిపించవు. కోలీవుడ్, బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలోనూ కొత్త హీరోయిన్స్ కి పెద్దగా అవకాశాలు ఉండవు. ఒక్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొత్త హీరోయిన్స్ కి, ఉన్న హీరోయిన్స్ కి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. అయితే తెలుగులో తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావు అనేది తాజాగా మెగాహీరోయిన్ నిహారిక కొణిదెల విషయంలో జరుగుతుందని చెప్పవచ్చు.


తెలుగు హీరోయిన్స్ కి టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. బొంబాయ్ తరహా యాక్టింగ్ కి సైతం రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్స్ ను సైతం…మన ఇండస్ట్రీ హీరోలు పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదిఏమైనా తెలుగు హీరోయిన్స్ కి టాలీవుడ్ లో అవకాశాలు పుష్కలంగా అందంటం అనేది ఓ కలగానే ఉండిపోతుంది. ఇందులో మెగా ఇమేజ్ ని కలిగి ఉన్న నిహారిక కొణిదెల సైతం మినమాయింపు ఎంత మాత్రం కాదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన నిహారిక కొణిదెల తన మొదటి సినిమా ‘ఒక మనసు’ తరువాత వెంటనే మరో చిత్రంలో నటించలేదు.


తనకి హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నప్పటికీ…కథల విషయంలో నిహారిక కొణిదెల కొన్ని బోర్డర్ లైన్స్ ని పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా తెలుగు దర్శకులు నిహారిక కొణిదెలకి కథని చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా నిహారిక కొణిదెల అన్ని రకాల కథలకి సరిపోయే హీరోయిన్ కాదని తెలుగు దర్శకులు అభిప్రాయంగా తెలుస్తుంది. ఇక ఈ మెగాహీరోయిన్ తో రొమాన్స్ చేయటానికి తెలుగు హీరోలు సైతం సాహసం చేయలేకపోతున్నారనే టాక్స్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. దీంతో యంగ్ హీరోలు సైతం ఈ బ్యూటీ జోలికి వెళ్ళకపోవటమే మంచిదని నిర్ణయించుకున్నటుగా తెలుస్తుంది.


దీంతో హీరోయిన్ గా విభిన్న పాత్రలతో తన టాలెంట్ ని నిరూపించుకోవాలి అనుకున్న నిహారిక కొణిదెల కోరిక టాలీవుడ్ లో తీరేవిధంగా లేదు. అందుకే ఈ బ్యూటీ కోలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న కొత్త చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందని, నిహారిక పలు సన్నివేశాల్లో నటించిందనేది షూటింగ్ రిపోర్ట్. ఈ మూవీ హిట్ ని సాధిస్తే… నిహారిక కొణిదెల ఇక కోలీవుడ్ లోనే హీరోయిన్ గా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: