తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.  స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  గత రెండు సంవత్సరాల నుంచి మనోడికి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.  పూరి దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుసగా వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి.  ఇక ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తుంది.  
Image result for ntr bobby
ఇండస్ట్రీలో రవితేజకు ‘పవర్’లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన బాబీ ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ నడుస్తున్నట్లు బాబీ తెలిపారు.   ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది కానీ ఆ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు.  
Image result for ntr bobby
అయితే  ఎన్టీఆర్ మాత్రం ఈనెల లో షూటింగ్ లో పాల్గొనడం లేదు , వచ్చేనెల లో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు ఎన్టీఆర్ . ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయాన్నీ కానీ సినిమా టైటిల్ జై లవకుశ అని కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కళ్యాణ్ రామ్ . జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . 



మరింత సమాచారం తెలుసుకోండి: