ఈరోజు పవన్ తన ‘కాటమరాయుడు’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యల పై పవన్ మరి కొద్ది సేపట్లో చేనేత సత్యాగ్రహం చేయబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రస్థుత రాజకీయాల పై పవన్ ఏమి మాట్లాడబోతున్నాడు అన్న ఆసక్తి అందరిలోనూ బాగా ఉంది. 

ఇది ఇలా ఉండగా నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన వీకెండ్ ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయనాయకుడు లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాల పై అతడి ‘జనసేన’ పార్టీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  పవన్ రాజకీయాలలోకి వచ్చింది అధికారం కోసం కాదని ఎంతో కొంత ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి వారిని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా కనీసం కొద్దిగా అయినా ఆలోచనలు చేసే వ్యక్తులుగా మార్చడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ సక్తికర కామెంట్స్ చేసాడు జెపి.

ఇదే సందర్భంలో ‘జనసేన’ పార్టీలో తాను చేరే విషయమై స్పందిస్తూ జయప్రకాష్ తనకు ఇక ప్రత్యక్ష రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని అయితే పవన్ కళ్యాణ్ కోరితే తాను ‘జనసేన’ పార్టీకి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంకేతాలు ఇచ్చారు జయప్రకాష్.  దీనిని బట్టి చూస్తూ ఉంటే పవన్ పిలుపు గురించి జయప్రకాష్ ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. 

అయితే పవన్ జయప్రకాష్ ఇస్తున్న సంకేతాలను అంది పుచ్చుకంటాడా లేదా అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ‘జనసేన’ లో సిద్ధాంత కర్తలు లేని నేపధ్యంలో జయప్రకాష్ లాంటి అనుభవజ్ఞుల సలహాలు పవన్ కు ఎంతో అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రస్తుతం పవన్ కేవలం పార్ట్ టైం పోలిటీషియన్ గా మారి అప్పుడప్పుడు మాత్రమే జనంలోకి వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతానికి పవన్ కు రాజకీయ పరంగా ఎవరి సలహాలు అవసరం లేదనే అని అనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: