ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి సంబంధించిన కూతుళ్ళును ఇంప్రెస్ చేయటానికి స్టార్ హీరోల కొడుకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ విధంగానే ప్రస్తుతం బాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల కూతుళ్ళని స్టార్ హీరోల కొడులు తెగ ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ పై బాలీవుడ్‌ యంగ్ హీరో కన్ను పడిందని అంటున్నారు.

తాజాగా సారా అలీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా సారా అలీ చేయబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా ఈ విషయాన్ని సైఫ్‌ అలీ ఖాన్ ప్రముఖ మీడియా సంస్థకి చెప్పుకొచ్చారు. సారా అలీ త్వరలోనే సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రి ఇవ్వనున్నారని....తన డెబ్యూ గ్రాండ్‌ గా ఉండనుందని చెప్పారు.

కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ఓ చిత్రంలో తన కుమార్తె నటించనుందని తెలిపారు. ఇదిలా ఉంటే సారా అలీ ఇప్పటికే బాలీవుడ్‌ కి చెందిన యంగ్ హీరోలతో డేటింగ్‌ లో ఉందని అంటున్నారు. ముఖ్యంగా రణ్‌ వీర్ సింగ్ లో సారా అలీ కొద్ది నెలలుగా డేటింగ్ చేస్తుందని అంటున్నారు. సారా అలీ సైతం రణ్‌ వీర్ సింగ్ తో గత కొంత కాలంగా నైట్‌ పార్టీలకి వెళుతుందని...వీరిద్దరు పలు ఈవెంట్స్ లో కలిసారని మీడియాలోనూ టాక్స్ వినిపిస్తున్నాయి.

త్వరలో సారా అలీ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రి ఇచ్చిన తరువాత రణ్‌ వీర్ సింగ్ తోనూ పలు మూవీలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా సారా అలీ-రణ్‌ వీర్ సింగ్ ల డేటింగ్‌ ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చర్ఛలకి దారితీస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: