భారత దేశంలో మహిళలపై ఈ మద్య అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  తాజాగా మళియాళ హీరోయిన్ భావన కిడ్నాపింగ్ చేయడం కార్లో ఆమెను లైంగికంగా వేదించడమే కాకుండా ఫోటోలు, వీడియో షూట్ కూడా తీయడం చేశారట.   దీంతో భావన ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నింధితులను పట్టుకున్నారు.  కాగా భావనకు జరిగిన అన్యాయంపై మాలీవుడ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది..ఒక సెలబ్రెటీ పరిస్థితితే ఇలా ఉంటే సామాన్య జనం పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.
Actress Bhavana Kidnapped and Molested
తమకు న్యాయం కావాలని మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని వారి గట్టిగా వాదిస్తున్నారు.  ఈ మేరకు పోలీసులకు దొరికిన దుండగులను ఇంటరాగేట్ చేస్తుంటే కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయట.   భావన కిడ్నాప్ వెనుక ఓ మలయాళ హీరో హస్తం ఉన్నట్లు పోలీసులకు సమాచం ఉన్నట్లు అయితే అది కన్ఫార్మ్ చేసుకోవడానికి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కేరళ పోలీసులు.  ఆ మద్య ఓ మళియాళ నటుడు భార్యకు విడాకులు ఇచ్చి మరొక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వ్యవహారంలో భావన హస్తం ఉన్నట్లు భావించిన ఆ హీరో తనకు ఎలాగైనా బుద్ది చెప్పాలని ఈ పని చేసి ఉంటాడా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదొక కథనం ప్రస్తుతం కేరళలో బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది . దాంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . అది నిజమా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: