తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవి వారసుడుగా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాన్.  మొదట్లో పవన్ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా..తనదైన మ్యానరీజంతో అభిమానులకు బాగా దగ్గరయ్యాడు.  తర్వాత ఖుషి, తమ్ముడు, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.  ఇక పవన్ కళ్యాన్ సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..దీంతో బయ్యర్లు, డిస్ట్రీబ్యూటర్లు కూడా పవన్ సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  
Image result for sardar gabbar singh
కాగా గత సంవత్సరం రిలీజ్ అయిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు, డిస్ట్రీబ్యూటర్లు చాలా నష్టపోయారు.  అయితే నష్టపోయిన్ వారు బాధపడాల్సిన అవసరం లేదని..తన తదుపరి చిత్రంతో వారిని ఆదుకుంటానని పవన్ అప్పట్లో మాట ఇచ్చారు.  కానీ ఇప్పుడు ‘కాటమ రాయుడు’ చిత్రాన్ని ఇవ్వకుండా ఎక్కువ రేటుకి వేరే వాళ్లకు అమ్మి మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సినిమా ని కొనుక్కున్న వాళ్ళు.  
Image result for sharath marar
 మరోవైపు శరత్ మరార్ లీగల్ గ మా తప్పు లేదు కావాలంటే ఒకసారి అగ్రిమెంట్ చదువుకో ఎక్కువగా చేస్తే సహించేది లేదు అంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారట.  దీంతో ఖంగు తిన్న కృష్ణా జిల్లా డిస్ట్రి బ్యూటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నాడు.  కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటామంటున్న పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మాకు మాత్రం అన్యాయం చేస్తాడా ? అంటూ ప్రశ్నిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: