టాలెంట్ ఉంటే ఏ బ్యాక్ గ్రౌండ్ అవసరం ఉండదు.. ఇది పక్కాగా సిని పరిశ్రమలో కొంతమందిని చూస్తే తెలుస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చి ఇక్కడ సక్సెస్ సాధించిన ఎంతోమంది హీరోలున్నారు. ఈ క్రమంలో తాజాగా సూపర్ ఫాంలో ఉన్న నాని అందరికి ఉదాహరణ అవ్వగా అదే దారిలో ప్రస్తుతం యువ హీరోల్లో మంచి జోష్ లో ఉన్న విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడుకోవచ్చు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ లో పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Image result for pelli chupulu movie

పెళ్లిచూపులు సక్సెస్ తో డిస్ట్రిబ్యూటర్లు విజయ్ సినిమా అంటే చాలు ఎగబడి కొంటున్నారట. పెళ్లిచూపులు ఒక్క సినిమా అతని రాత మార్చేసిందని తెలుస్తుంది.చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లిచూపులు ఊహించని సక్సెస్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ క్రమంలో విజయ్ నటించిన ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలు ప్రీ రిలీజ్ లో అదరగొడుతున్నాయట.

Image result for pelli chupulu movie

పెళ్లిచూపులు సక్సెస్ లానే ఇవి కూడా అలరిస్తాయని ఈ పోటీ జరుగుతుంది. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేశాయి అందుకే విజయ్ సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు తెగ ఆరాటపడుతున్నారట. మరి ఇదే జోష్ రెండు మూడు సినిమాలకు జరిగితే విజయ్ కూడా ఓ రేంజ్ పాపులర్ హీరో అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: