సూపర్ స్టార్ మహేష్ బాబు సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తే చూడలనుకున్న అభిమానుల ఆశలు ఆశలులానే మిగిలేలా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు సంవత్సరానికి రెండు వస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఎన్నాళ్ల నుండో సంవత్సరానికి రెండు సినిమాలను రిలీజ్ చేయాలని మహేష్ చూస్తున్నా అది వీలు కాలేదు. ఈసారి మాత్రం అలా రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాని ఈ సంవత్సరం కూడా మహేష్ ఒక్క సినిమానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


ప్రస్తుతం మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్స్ మీద ఉంది. అసలైతే ఇప్పటికల్లా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఆ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. జూన్ కల్లా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహేష్ కొరటాల శివ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అని అన్నారు. కాని పరిస్థితి చూస్తుంటే అది పోస్ట్ పోన్ అయ్యేట్టు ఉంది. మురుగదాస్ సినిమా గుమ్మడికాయ కొడితే కాని మహేష్, కొరటాల శివ సినిమా షూటింగ్ కు వెళ్లదు.


అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మురుగదాస్ సినిమా ఈ సమ్మర్ లో కొరటాల శివ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని చూశాడు మహేష్. కాని షూటింగ్ లేట్ అవడం వల్ల ఈ సంవత్సరం కూడా ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కొరటాల శివ మూవీ 2018 సంక్రాంతి రేసులో నిలుస్తుందట. ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించేలా ఉన్నా లేట్ అయినా సరే రికార్డులు తిరగరాసే సినిమా కావాలని ఆశిస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: