ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. లాస్ట్ ఇయర్ నేను శైలజ, హైపర్ సినిమాలతో అలరించిన రామ్ తన తర్వాత సినిమా మీద ఇంకా కన్ ఫ్యూజన్ వీడలేదు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో సినిమా స్టార్ట్ అవడమే లేటు అన్నంత చర్చలు జరిగి చివరకు ఆ సినిమాలు వేరే హీరోలు చేసేస్తున్నారు. రామ్ మాత్రం తనకు ఏమి పట్టనట్టు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ లు గట్రా చేస్తున్నాడు.    


అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో టచ్ లో ఉంటున్న రామ్.. తన ప్రెజెంట్ లుక్ ను ఫోటోలుగా తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా అందిస్తున్నాడు. ఇక ఇలాంటి టైంలో రామ్ కు అనుకోకుండా ఓ వీరాభిమాని నుండి షాక్ తగిలింది. తన తర్వాత సినిమా మరో రెండు రోజుల్లో ఎనౌన్స్ చేయకపోతే తాను నిరాహారదీక్ష చేస్తానని అన్నాడు. దీనికి వెంటనే స్పందించిన రామ్.. తమ్ముడు కొత్తగా టెన్షన్ పెట్టొద్దు అదే పనిలో ఉన్నా అని ట్వీట్ చేశాడు.    


మొత్తానికి రామ్ ను అలా టెన్షన్ పెట్టించేశాడు ఆ అభిమాని. తన ఫ్యాన్స్ ను హర్ట్ చేయడం ఇష్టం లేని రామ్ వెంటనే ట్వీట్ కు రిప్లై కూడా ఇవ్వడం అందరిని సంతోష పరచింది. అయితే ఆ ఫ్యాన్ కోరిక మేరకు త్వరలోనే సినిమా ఎనౌన్స్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో సినిమాకు కథా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే రామ్, కరుణాకరణ్ కలిసి ఎందుకంటే ప్రేమంట సినిమా చేశారు. ఆ సినిమా ఆశించినంత సక్సెస్ అందుకోలేదు.    



మరింత సమాచారం తెలుసుకోండి: