పవన్ కళ్యాణ్ ఎవరితోను పెద్దగా కలవడు తన ప్రపంచంలో తాను జీవిస్తూ ఉంటాడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి.  సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా రోజురోజుకు పెరిగి పోతున్న పవన్ ఇమేజ్ ని అందుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ లోని ఏ హీరోకు సాధ్యం కాని పని.  మిగిలిన హీరోలకన్నా చాల భిన్నంగా వ్యవహరించే పవన్ ఈమధ్య రానురాను ఎవరికీ అందుబాటులో లేని వ్యక్తిగా మారిపోతున్నాడు అన్న కామెంట్స్ తెగ వినిపిస్తున్నాయి.  

సినిమానటులు సాధారణంగా అందర్నీ కలవడానికి ఇష్టపడరు. అయితే రాజకీయాలలో కొనసాగాలి అని అభిప్రాయపడే నాయకులకు జనంతో తరుచు కలవకుండా జరగని పరిస్థితి. అయితే ప్రస్తుతం పవన్ కొద్దిమంది సన్నిహితులతోనే తన కాలం గడుపుతున్న నేపధ్యంలో పవన్ వద్దకు వెళ్ళాలి అంటే ఆయనకు సన్నిహితంగా ఉండే వారిలో ఎవరో ఒకరు పూనుకుంటే తప్పించి ఆయన దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు పవన్ కళ్యాణ్ సోదరులు చిరంజీవి నాగబాబులు ఎవరైనా రికమండ్ చేస్తే తప్పించి పవన్ తో మాట్లాడే అవకాశం ఎవరికీ దొరకడం లేదు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. సినిమా సెలెబ్రెటీగా ఇటువంటి వ్యవహారాలు ఎవరు నడిపినా ఎవరు అంతగా పట్టించుకోరు. అయితే ‘జనసేన’ తరపున ఎన్నికలలో పోటీ చేస్తాను అని చెపుతున్న పవన్ ఇప్పటికీ ఎవరికీ అందుబాటులో లేకుండా ప్రవర్తిస్తున్న నేపధ్యంలో పవన్ కోరుకున్న మంచి వ్యక్తులు పవన్ ఏ విధంగా కాంటాక్ట్ చేసి మెప్పించగలుగుతారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

దీనితో రాజకీయాలకు సంబంధించి అలాగే వ్యక్తులకు సంబంధించి పవన్ కు అందవలసిన ఫీడ్ బ్యాక్ సక్రమంగా అందడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమధ్యనే చేనేతల సమస్యల మీద గళం విప్పటానికి హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లిన పవన్ అక్కడ తనను కలవడానికి ప్రయత్నించిన వారితోకూడ అంటీముట్టనట్లుగా ప్రవర్తించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది అని టాక్.  

పాలకుల విధానాల్ని తప్పు పట్టే పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్ల విషయంలో తనకు తానే ఇచ్చిన హామీని పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు తూట్లు పొడుస్తూ ఉన్నా ఏమి మాట్లాడకుండా మౌనం వహించడం ఏమిటి అంటూ ఘాటైన కామెంట్స్ పవన్ వ్యతిరేకులు చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: