బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. స్మాల్ స్క్రీన్ నుండి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కు షిఫ్ట్ అయిన ఈ భామ ఐటం సాంగ్స్ తో కూడా రచ్చ చేస్తుంది. సాయి ధరం తేజ్ విన్నర్ మూవీలో అనసూయ ఐటం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. అయితే సినిమాలో సాంగ్ ఆశ చూపిన విన్నర్ యూనిట్ ఆమెను బాగా వాడుకుని వదిలేశారట.


అదెలా అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఐటం సాంగ్ ఆఫర్ వచ్చినా కాదన్న అనసూయ ఇప్పుడు తేజ్ సినిమాలో ఐటం గా హల్ చల్ చేస్తుంది. సినిమాలో ఆ సాంగ్ కోసం భారీ మొత్తంగా 20 లక్షల దాకా డిమాండ్ చేసిందట అమ్మడు. అనసూయ క్రేజ్ సినిమాకు హెల్ప్ అవుతుందని అంత ఇవ్వడానికి ఒప్పుకున్నారట.  


ముందు అడ్వాన్స్ గా 12 లక్షలు ఇచ్చేసి ఆమెతో సాంగ్ చేయించుకున్న దర్శక నిర్మాతలు మిగతా ఎమౌంట్ కోసం మాత్రం ఇబ్బంది పెడుతున్నారట. అందుకే అనసూయ విన్నర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండట్లేదు అంటున్నారు. అనసూయ అందాలను ఎరగా వేసి క్రేజ్ తెచ్చుకోవాలన్న ఆలోచన బాగుంది కాని ఆమెకు ఇవ్వాల్సిన ఎమౌంట్ సెటిల్ చేసుకుంటే మంచింది. ఇక ఈ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూసి అనసూయ ఐటం గాళ్ గా కొనసాగుతా అంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: