సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య తమిళనాడు యువతకు సపోర్ట్ చేస్తూ జల్లికట్టు గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ అది కేవలం తన సినిమా తమిళంలో రిలీజ్ అవుతుంది కాబట్టి వారిని ఎట్రాక్ట్ చేయడానికి అనుకున్నారు. అయితే కారణం ఏదైనా మురుగదాస్ సినిమాతో తమిళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే పనిలో ఉన్న మహేష్ జల్లికట్టుని కూడా సినిమాలో ప్రస్థావించబోతున్నారట.


మరి ఆ ఆటని చూపిస్తారో లేక మరేమో కాని మురుగదాస్ మాత్రం సినిమాలో ఆ ఆట గురించి ప్రస్థావిస్తారట. యువత స్పోర్టివ్ గా తీసుకుని నడిపించిన ఆ ఉద్యమం చాలా క్రేజ్ తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చేలా చేసిన జల్లికట్టు ఫీవర్ మహేష్ తన సినిమా కోసం వాడటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక సినిమాలో మహేష్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తాడని తెలిసిందే.


సంభవామి టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతుందట. సినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ టీజర్ 24న రిలీజ్ కాబోతుంది. మహేష్ సినిమాలో ఎలా కనిపించనున్నాడో అసలు సినిమా కథ ఏంటో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: