టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా పూరి ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నడో తెలిసిందే. పూరి సినిమా అంటే పక్కా హిట్ అన్న సమీకరణాలు ఒకప్పుడు ఉండేవి. తను తీసే సినిమా హీరో ఎంత స్టార్ అయినా సరే పూరి సినిమా మాత్రం అనుకున్న బడ్జెట్ లో అనుకున్న రోజుల్లో తీసేస్తాడు. అయితే అలాంటి పూరికి ఈమధ్య దెబ్బ మీద దెబ్బ పడుతుంది. 


టెంపర్ తర్వాత ట్రాక్ పూర్తిగా తప్పేశాడు డైరక్టర్ పూరి జగన్నాథ్.. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం మూడు ఫ్లాపులతో బ్యాడ్ టాక్ తెచ్చుకున్న పూరి ప్రస్తుతం రోగ్ మూవీతో రాబోతున్నాడు. కొద్దిగంటల క్రితం ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేయగా అందులో పూరి తన మార్క్ కనిపిస్తుంది. రొటీన్ గా తన సినిమాల్లో హీరోలానే ఇషాన్ ను చూపించాడు పూరి.


ఈ పోస్టర్ పై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన ప్రతి సినిమా పోస్టర్స్ తో ఎట్రీక్ట్ చేసే పూరి ఈ రోగ్ పోస్టర్స్ మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇది కచ్చితంగా పూరి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందని.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని పూరి సన్నిహితులు బల్లగుద్ది చెబుతున్నారు. మరి పోస్టర్ రొటీన్ గా అనిపించినా కనీసం ఈ రోగ్ సినిమా అయినా పూరిని హిట్ బాట పట్టిస్తుందేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: