టాలీవుడ్‌ స్టార్ హీరో నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. తను నటిస్తున్న వరుస చిత్రాలు అన్ని బాక్సాపీస్ వద్ద మంచి విజయాల్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా నాని నటించిన 6 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకొని ఇప్పుడు కొత్త మూవీలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శివ నిర్వానంద్ డైరెక్షన్లో నాని ప్రస్తుతం 19వ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్ వంటి లోకేషన్లలో జరుగుతుంది ఇదిలా ఉంటే నాని మరో రెండు సంవత్సరాల్లో 25 సినిమాలను పూర్తి చేయనున్నారు. దీని కోసం తన 25వ చిత్రాన్ని ఎవరితో ప్లాన్ చేయాలి అనే దానిపై నాని ఇప్పటికే ఓ ప్లాన్ ని రెడీ చేసుకున్నారని తెలుస్తుంది. 2019లో నాని తన 25వ చిత్రంలో నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కాంబినేషన్ పై నాని భారీ ప్లానింగ్స్ చేశారు.

ఈగ మూవీతో తనకి మంచి ఫేం ని క్రియేట్ చేసిన రాజమౌళితోనే నాని తన 25వ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అది ఈగ సీక్వెల్ గా వస్తుందా? మరో కొత్త కథాంశంగా వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి సైతం నానితో మరోమూవీని చేయాలని ఎప్పటి నుండో ఆసక్తి చూపుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం రాజమౌళి నుండి నానికి ఫోన్ కాల్ వచ్చిందని...త్వరలోనే ఓ మూవీ చేద్ధాం అనేది దాని సారాంశం అని ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి.

మొత్తంగా నాని 25వ చిత్రం భారీ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ నెల 24న నాని పుట్టిన రోజు సందర్బంగా తన 19వ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో నానికి జోడీగా నివేత థామస్ నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: